టీవీఎస్ మోటర్స్ సరికొత్త రికార్డు.. అరకోటి దాటిన బైక్స్ ఉత్పత్తి

టీవీఎస్ మోటారు సైకిల్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. గురుగ్రామ్‌లోని తన ప్రొడక్షన్ యూనిట్‌లో 50 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసింది. 
 

Suzuki Motorcycle India rolls out 50th lakh product

న్యూఢిల్లీ: భారత్​లో  దిగ్గజ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్​సైకిల్​ ఇండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. 50 లక్షల ద్విచక్ర వాహనాలను  ఉత్పత్తి చేసి మరో మైలురాయిని చేరుకుంది. ఇది టీవీఎస్ మోటారు సైకిల్స్ సుజుకీ ఉత్పత్తులపై తమ వినియోగదారులు చూపిన అపారమైన అభిమానం, విశ్వాసానికి నిదర్శనమని సంస్థ యాజమాన్యం పేర్కొంది.

గురుగ్రామ్​లోని ఖేర్కిధౌలాలో తన తయారీ కేంద్రం వద్ద 50 లక్షవ వాహనాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్​సైకిల్​ ఇండియా ప్రైవేటు లిమిటెడ్​(ఎస్​ఎంఐపీఎల్​) ప్రకటించింది. బీఎస్​-6 శ్రేణి సుజుకీ గిక్సర్ ఎస్ఎఫ్​ 250 బైక్ వల్లే తమ సంస్థ ఈ మైలురాయిని చేరుకున్నదని ఎస్ఎంఐపీఎల్ తెలిపింది.

సుజుకీ మేనేజింగ్​ డైరెక్టర్​ కొచిరో హిరావ్ స్పందిస్తూ.. ‘ఈ ఏడాది సుజుకీ మోటార్​ కార్పొరేషన్​ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 50లక్షల ద్విచక్ర వాహనాలను ఉత్పతి చేయడం ద్వారా భారత్​లో మరో మైలు రాయిని చేరుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇది సుజుకీ ఉత్పత్తులపై మా వినియోగదారులు చూపిన అపారమైన అభిమానం, నమ్మకానికి నిదర్శనం’ అని తెలిపారు. 

2018-19తో పోలిస్తే భారత్​లో 2019-20లో సుజుకీ మోటార్​సైకిల్​ ఇండియా 5.7శాతం వృద్ధి నమోదు చేసింది. సుజుకీ యాక్సెస్​125, గిక్సెర్​ 250, 150 సహా మోటార్​సైకిల్స్​​, స్కూటర్ల​ అమ్మకాలు పెరగడమే ఇందుకు కారణం.

also read మార్కెట్లోకి ఎం‌జి హెక్టార్‌ ప్లస్‌ కొత్త వెరీఎంట్..ధర ఎంతంటే ? ...

సెప్టెంబర్‌ 30లోగా రిటర్నులను వెరిఫై చేసుకోవాలి
2015-16 నుంచి 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో దాఖలు చేసిన పన్ను రిటర్నులను ఇంకా వెరిఫై చేసుకోని పన్ను చెల్లింపుదారులకు ఏకకాల సడలింపు ఇస్తున్నట్టు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోగా రిటర్నుల వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని వారికి స్పష్టం చేసింది. 

డిజిటల్‌ సిగ్నేచర్‌ లేకుండా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు ఆధార్‌ ఓటీపీ (వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌)ను ఉపయోగించడంతో నెట్‌ బ్యాంకింగ్‌తో ఈ-ఫైలింగ్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అవడం ద్వారా రిటర్నులను వెరిఫై చేసుకోవాలని తెలిపింది.

ఇవి రెండూ కుదరకపోతే ఐటీఆర్‌ను అప్‌లోడ్‌ చేసిన 120 రోజుల్లోగా వ్యక్తిగతంగా సంతకం చేసిన ఐటీఆర్‌-5 కాపీని పోస్టు ద్వారా సీపీసీ బెంగళూరుకు పంపి రిటర్నులను వెరిఫై చేసుకోవాలని సూచించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios