ద్విచక్రవాహనాల కోసం కొత్త రూల్స్.. బైక్‌పై వెనుక కూర్చునేవారి కోసం ఇవి తప్పనిసరి ఉండాలి..
అన్ని బైక్‌లకు వెనుక చక్రం సగం కవర్ అయ్యేలాగా 'సారి గార్డ్'లతో పాటు హ్యాండ్‌హోల్డ్‌లు, ఫుట్‌రెస్ట్‌లు తప్పనిసరి అని తెలిపింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహనాల (ఏడవ సవరణ) నిబంధనలు 2020కు తెలియజేసింది.
ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది, అన్ని బైక్‌లకు వెనుక చక్రం సగం కవర్ అయ్యేలాగా 'సారి గార్డ్'లతో పాటు హ్యాండ్‌హోల్డ్‌లు, ఫుట్‌రెస్ట్‌లు తప్పనిసరి అని తెలిపింది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహనాల (ఏడవ సవరణ) నిబంధనలు 2020కు తెలియజేసింది. తదనుగుణంగా కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989ను సవరించే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఈ మార్గదర్శకాలను రూపొందించారు.
ఈ మార్గదర్శకాలలో బైక్ వెనుక సీటులో కూర్చున్న వారు ఏ నియమాలను పాటించాలో వివరించారు. నిబంధనల ప్రకారం, బైక్ వెనుక సీటుకు ఇరువైపులా హ్యాండ్ హోల్డ్స్ తప్పనిసరి. ముఖ్యంగా వెనుక కూర్చున్నా మహిళల భద్రత కోసం చేతి పట్టు ఉండడానికి, బైక్ నడిపేవారు అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు హ్యాండ్ హోల్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
*సవరించిన నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాల తయారీదారులు బైక్ వెనుక చక్రం వైపు లేదా డ్రైవర్ సీటు వెనుక హ్యాండ్‌హోల్డ్స్‌ను తప్పనిసరి ఉండేలా చూడాలి. ఇది ఇప్పటివరకు చాలా బైక్‌లకు ఈ సౌకర్యం లేదు.
*వాహన తయారీ సంస్థలు బైక్ రెండు వైపులా వెనుక కూర్చున్నా వారికోసం ఫుట్‌రెస్ట్‌లను అందించడంతో పాటు, వెనుక టైర్ లో బట్టలు చిక్కుకోకుండా ఉండటానికి వెనుక చక్రంపై సారి గార్డ్ పరికరాలను అందించాలి. దీని ఉద్దేశ్యం ఏమిటంటే వెనుక కూర్చున్న వారి బట్టలు చక్రంలో చిక్కుకోవు.
also read ఆరంభంలోనే అదరగొట్టిన నిస్సాన్ మాగ్నైట్ బుకింగులు.. కేవలం 5 రోజుల్లోనే 5 వెలకి పైగా.. ...
వెనుక టైరులో దుస్తులు చిక్కుకోవడం కారణంగా దేశంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో ఎక్కువగా బాధితులైనవారు మహిళలు అని తెలిపింది.
*వీటితో పాటు తేలికైన కంటైనర్లను బైక్‌లో ఉంచడానికి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైనర్ పొడవు 550 ఎంఎం, వెడల్పు 510 ఎంఎం, ఎత్తు 500 ఎంఎం మించకూడదు.
ఇంతకుముందు ప్రభుత్వం టైర్లకు సంబంధించి కొని కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని కింద గరిష్టంగా 3.5 టన్నుల బరువున్న వాహనాలకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలని సూచించింది.
ఈ వ్యవస్థలోని సెన్సార్ ద్వారా డ్రైవర్ వాహనం టైర్‌లోని గాలి లెవెల్ గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీనితో పాటు టైర్ పంచర్ రిపేర్ కిట్లను కూడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది.