Asianet News TeluguAsianet News Telugu

సానియా ఈజ్ బ్యాక్... మళ్లీ రాకెట్ పట్టింది

 ఆరు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ సాధించిన సానియా ఒకానొక దశలో ప్రపంచ నంబర్‌వన్‌ డబుల్స్‌ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 11 నుంచి జరిగే డబ్ల్యూటీఏ హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొంటుంది. మహిళల డబుల్స్‌లో నదియా కిచెనక్‌ (ఉక్రెయిన్‌)తో మిక్స్‌డ్‌లో రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగనుంది.

Sania Mirza hits the court to train for season 2020
Author
Hyderabad, First Published Jan 1, 2020, 8:35 AM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... మళ్లీ బరిలోకి దిగింది. ఓ కుమారుడికి తల్లి అయిన తర్వాత కూడా తనలో ఆట పట్ల తపన తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాగా బరువు పెరిగిన సానియా... తర్వాత కసరత్తులు చేసి మరీ దాదాపు 26 కేజీలు తగ్గింది. 

 2017లో చైనా ఓపెన్‌ ఆడుతున్న సమయంలో మోకాలు గాయంతో ఆటకు దూరమైన సానియా తదనంతరం గర్భం దాల్చడంతో పూర్తిగా రాకెట్‌ను అటక ఎక్కించింది. తనకిష్టమైన టెన్నిస్‌ తనకు దూరమైన బాధ కలుగుతుందనే ఉద్దేశంతో ఆమె ఈ రెండేళ్లు టీవీల్లో కూడా టెన్నిస్‌ మ్యాచ్‌లు చూడలేదని చెప్పింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది.

ఆరు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ సాధించిన సానియా ఒకానొక దశలో ప్రపంచ నంబర్‌వన్‌ డబుల్స్‌ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 11 నుంచి జరిగే డబ్ల్యూటీఏ హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొంటుంది. మహిళల డబుల్స్‌లో నదియా కిచెనక్‌ (ఉక్రెయిన్‌)తో మిక్స్‌డ్‌లో రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగనుంది.

‘నేను మళ్లీ రాకెట్‌ పట్టడానికి ప్రధాన కారణం... నేను టెన్నిస్‌ ఆడటం, గెలవటం, పోటీపడటం వీటన్నింటిని మిస్‌ అవుతున్నానన్న భావన నన్ను నన్నులా ఉండనివ్వడం లేదు. నిజం చెప్పాలంటే గత రెండేళ్లుగా నా కిట్‌ను పక్కన బెట్టేశాను. నేను అనుకున్న ఫలితాలు సాధించాననే తృప్తితో ఉన్నాను. అయితే అప్పుడే నాలో ఇంకా టెన్నిస్‌ ఆడే సత్తా మిగిలే ఉందని అనిపించింది. ఇలా అనిపించడం వల్లే మళ్లీ బరిలోకి రాగలుగుతున్నాను’ అని వివరించింది. పెళ్లితో ఓ గృహిణిగా మారాక తనలో ఎన్నో మార్పులొచ్చేవని... ఇక నా ఆట నా నుంచి పూర్తిగా దూరమవుతుందనే బెంగకూడా ఉండేదని సానియా చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios