భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  సైనా నెహ్వాల్ ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. దేశరాజధాని ఢిల్లీలో ఆమె బుధవారం కమలం గూటికి చేరారు. బాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనాకు మంచి పేరు ఉన్నది.  ఎన్నో పధకాలు సాధించింది.  అయితే, సైనా నిన్నటి రోజున జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ అయ్యింది.  

అయితే  సైనా పొలిటికల్ ఎంట్రీపై సహచర క్రీడాకారిణి గుత్తా జ్వాలా అసహనం వ్యక్తం చేసింది. సైనాని కించపరిచేలా కామెంట్ చేసింది.  ఇప్పటి వరకు రాకెట్ తో అర్ధం పర్ధంలేని ఆటలే ఆడావ్ అని అనుకున్నానని, కానీ, ఇప్పుడు అర్ధంపర్ధం లేని పార్టీలో చేరిపోయాయని, దీని ప్రభావం కెరీర్ పై పడుతుంది అనే రీతిలో ట్వీట్ చేసింది.  గుత్తా చేసిన ఈ ట్వీట్ కమల దళాన్ని ఆగ్రహం కలిగించేలా చేస్తున్నాయి.  గుత్తా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  

 

గుత్తా ట్వీట్ కి సైనా ఇప్పటి వరకు స్పందించలేదు కానీ... నెటిజన్లు మాత్రం గట్టి కౌంటర్లే ఇచ్చారు. ‘ అర్థం లేని పెళ్లిళ్లు మాత్రం చేసుకోలేదులే’ అంటూ ఓ నెటిజన్ గుత్తాకి కౌంటర్ వేశారు. మరో నెటిజన్..  నీకు నచ్చిన పార్టీలో నువ్వు కూడా చేరొచ్చు కదా అంటూ సలహా ఇచ్చాడు.

Also Read సైనా పొలిటికల్ ఎంట్రీ: బీజేపీలోకి నెహ్వాల్...

ఇంకో నెటిజన్ మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు. ‘‘ నీతోటి క్రీడాకారిణి పట్ల అంత ద్వేషం ఎందుకు? ఆమె భవిష్యత్తు ఇన్నింగ్స్ కోసం మంచి జరగాలని కోరుకోవచ్చు కదా. అయినా.. ఆమె బీజేపీలో ఎందుకు చేరిందో ఓ న్యూస్ ఛానెల్ కి వివరించారు. కావాలంటూ నువ్వు కూడా చూడొచ్చు.’ అంటూ ట్వీట్ చేశాడు. ఇంకొందరు మాత్రం సైనాని చూసి గుత్తా జ్వాలా అసూయ పడుతోందంటూ మండిపడుతున్నారు.