Asianet News TeluguAsianet News Telugu

సంఖ్య చెప్పకుండా ‘వోక్స్ వ్యాగన్’ మూడు మోడల్ కార్లు రీకాల్

సంఖ్య చెప్పకుండా ‘వోక్స్ వ్యాగన్’ మూడు మోడల్ కార్లు రీకాల్ 

VW recalls unspecified number of Polo GT, Vento and Jetta models in India
Author
New Delhi, First Published Sep 18, 2018, 11:08 AM IST

న్యూఢిల్లీ: వోక్స్ వ్యాగన్ అంటే భారతీయులందరికి తెలుసు. ఈ జర్మనీ కారు మేకర్ తాజాగా మూడు రకాల మోడల్ కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. 2015 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2017 మార్చి 31వ తేదీ వరకు భారతదేశంలో ఉత్పత్తి చేసిన పొలొ జీటీ, వెంటో, జిట్టా మోడల్ కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. అయితే ఎన్ని కార్లను రీ కాల్ చేస్తున్నారో తెలియడం లేదు. సదరు మూడు మోడల్స్ కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు ఈ నెల 15వ తేదీన బహిరంగ నోటీసు జారీ చేసింది. 

పొలో జీటీ 1.5, వెంటో 1.5 మోడల్ కార్లలో తప్పనిసరిగా మాన్యువల్ ట్రాన్సిమిషన్ చేయాల్సిన అంశాలు ఉన్నాయని వోక్స్ వ్యాగన్ సంస్థ ప్రకటించింది. జెట్టా1.4 టీఎస్ఐ మోడల కారులోని కార్బన్ కనిస్టర్‌లో ‘ఓ-రింగ్స్’ను పూర్తిగా మార్చేయాలని తీర్మానించింది. తాజాగా రూపొందించిన ఓ- రింగ్స్‌ను కాలుష్యాన్ని నివారించడంతోపాటు ఆయిల్ ఆవిరి కాకుండా కర్బన్ కనిస్టర్ సహకరిస్తుంది. ఎన్ని కార్లను రీకాల్ చేస్తున్నారో కూడా పేర్కొనని వోక్స్ వ్యాగన్.. మీడియా సంస్థలు పంపిన ఈ- మెయిల్స్‌కు కూడా ప్రతిస్పందించలేదు.  

ఇంతకుముందు 2016 ఏప్రిల్ ఒకటో తేదీన 3,877 వెంటో కార్లను రీకాల్ చేసింది వోక్స్ వ్యాగన్. 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్, కార్బన్ మొనాక్సైడ్ (సీఓ) ఉద్గారాల నిర్వహణలో అసంబద్ధంగా వ్యవహరిస్తున్న మాన్యువల్ గేర్ బాక్స్ వల్ల కార్ల విక్రయాలు నిలిచిపోయాయి. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్ఏఐ) నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ వాహనం నుంచి అనుమతించిన దానికంటే కార్బన్ మొనాక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని తేలింది. 

అంతకుముందు 2014 డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా వోక్స్ వ్యాగన్ విభిన్న మోడల్ కార్లను మార్కెట్ నుంచి ఉపసంహరించింది. ఇతర ఆటోమబైల్ సంస్థలు ఆడి, వోక్స్ వ్యాగన్, స్కోడా 2008 నుంచి 2015 నవంబర్ వరకు విక్రయించిన వివిధ రకాల మోడల్ కార్లను ఉపసంహరించుకున్నాయి. వివిధ ఆటోమొబైల్ సంస్థలు తమ కార్లలో అమర్చిన ‘ఈఏ 189’ డీజిల్ ఇంజిన్లపై ఉద్గారాల పరీక్షలు నిర్వహించకుండా మోసగించాయని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2016లో కార్ల ఇంజిన్లను అప్‌డేట్ చేసేందుకు రీకాల్ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios