స్కూటీ పెప్‌కు రజతోత్సవం: విపణిలోకి న్యూ లుక్‌తో ఎంట్రీ

టీవీఎస్ మోటార్ సైకిల్స్ ఆవిష్కరించిన స్కూటీకి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నూతన అప్ డేట్స్‌తో కూడిన స్కూటీ ‘పెప్ ప్లస్’ను విపణిలో ఆవిష్కరించారు.

TVS Scooty Pep+ Matte Edition Launched in India at Rs 44,764

టీవీఎస్‌ మోటార్స్ సంస్థ స్కూటీపెప్‌లో కొత్త ఎడిషన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. స్కూటీ బ్రాండ్‌కు 25 సంవత్సరాల పూర్తైన సందర్భంగా కొత్త అపడేట్స్‌తో సరికొత్తగా టీవీఎస్‌ స్కూటీ పెప్‌ ప్లస్‌ను సంస్థ ఆవిష్కరించింది. 

దీని ధరను రూ. 44,764గా టీవీఎస్ మోటార్ సైకిల్స్ నిర్ణయించింది. 3డీ ఆంబ్లమ్‌, ప్రెష్‌ గ్రాఫిక్స్‌, సీట్ల మార్పు తదితర రిఫ్రెష్‌ లుక్‌లో స్వల్ప మార్పులు తప్ప టీవీఎస్‌ స్కూటీ పెప్‌ ప్లస్‌లో యాంత్రికంగా భారీ మార్పులేవీ లేవు. 

87.8 సీసీ ఎయిర్‌-కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఎకో థ్రస్ట్‌ ఇంజిన్‌, 4.8 బీహెచ్పి, 5.8 ఎన్‌ఎమ్‌ పీక్‌ టార్క్‌ కీలక ఫీచర్లుగా ఉన్నాయి. ఎగుడు దిగుడు రోడ్లపైనా సునాయాసంగా ప్రయాణించేందుకు టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌తోపాటు వెనుక భాగంలో సింగిల్‌ షాక్‌, సీబీఎస్‌, డ్రమ్‌ బ్రేక్‌లతో దీనిని తీర్చిదిద్దారు.

ఇందులో మొబైల్ చార్జర్ సాకెట్, సైడ్ స్టాండ్ అలారం, అండర్ సీట్ స్టోరేజీ హుక్స్, డీఆర్ఎల్స్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, టీవీఎస్ పేటెంటెడ్ టెక్నాలజీతో ‘ఈజీ’ స్టాండ్ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల 30 శాతం సెంటర్ స్టాండ్ పై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios