వచ్చే నెల 6వ తేదీన టయోటా గ్లాన్జాను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. దీనిని మారుతీ సుజుకీ బాలినోకు క్లోనింగ్‌గా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. టయోటా సరికొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది.

జూన్‌ 6వ తేదీన మార్కెట్లోకి ఈ కారును విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. మారుతీ సుజుకీతో  ఒప్పందంలో భాగంగా టయోటా ఉత్పత్తి చేసేందుకు అంగీకరించిన మూడు మోడళ్లలో బాలినో కూడా ఒకటి. 

టీజర్‌లో కనిపించిన దాని ప్రకారం మారుతి సుజుకి బాలినోలో వాడిన అలాయ్‌ వీల్స్‌నే దీనికి కూడా వినియోగించినట్లు తెలుస్తోంది. వీటిపై టయోటా లోగో ఉంది. కొత్త కారులో స్లేట్‌ క్రోమ్‌ గ్రిల్స్‌ను అమర్చారు. 

టయోటా గ్లాన్జా మోడల్ కారుకు ఫార్చ్యూనర్‌ గ్రిల్‌ను అమర్చారు. కొత్త కారులో 1.2లీటర్‌ 4సిలిండర్‌ కె12 పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇదే ఇంజిన్‌ మారుతీ సుజుకీ బాలినోలో కూడా అమర్చారు. 5-స్పీడ్ గేర్ బ్యాక్, ఆప్షనల్‌గా సీవీటీ యూనిట్ చేరుస్తారు. ఇక 1.3 లీటర్ల డీడీఐఎస్ డీజిల్ మోటార్ మోడల్ కారు ఆవిష్కరణపై ఇంకా స్పష్టత రాలేదు.

టయోటా గ్లెన్జా రెండు వేయింట్లలోనే వచ్చే అవకాశం ఉంది. వీ, జీ వేరియంట్లుగా వీటిని పిలుస్తున్నారు. ఇవి మారుతి సుజుకి బాలెనోలోని ఆల్ఫా, జీటా వేరియంట్ కార్లతో సమాన సామర్థ్యం కలిగి ఉంటాయి. అంతే కాదు టయోటా తన గ్లెన్జా మోడల్ కారుకు లక్ష కిలోమీటర్ల వరకు గానీ, మూడేళ్ల వరకు గానీ వారంటీ ఇస్తోంది.