Asianet News TeluguAsianet News Telugu

భద్రతే ముఖ్యం: మార్కెట్‌లోకి ‘టయోటా’ కొత్త వర్షన్లు

జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) తన వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలిచ్చింది. మూడు రకాల మోడల్స్‌ ఇన్నోవా క్రిస్టా, టూరింగ్‌ స్పోర్ట్‌, ఫార్చూనర్‌లలో సరికొత్త వెర్షన్‌లను మార్కెట్లోకి తెచ్చింది.

Toyota Innova Crysta, Fortuner get more features
Author
New Delhi, First Published Sep 2, 2018, 11:21 AM IST

ముంబై: జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) తన వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలిచ్చింది. మూడు రకాల మోడల్స్‌ ఇన్నోవా క్రిస్టా, టూరింగ్‌ స్పోర్ట్‌, ఫార్చూనర్‌లలో సరికొత్త వెర్షన్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ఇన్నోవా క్రిస్టా కారు ధర (ఢిల్లీ ఎక్స్‌షో రూమ్‌ ప్రకారం) రూ.14.65 లక్షల నుంచి రూ. 22.01 లక్షల వరకు, ఇన్నోవా టూరింగ్‌ స్పోర్ట్‌ ధర రూ.18.59 లక్షల నుంచి రూ. 23.06 లక్షలు, ఫార్చూనర్‌ ధర రూ.27.27 లక్షల నుంచి రూ. 32.97 లక్షల వరకు పలుకుతుందని కంపెనీ తెలిపింది. 

2016లో ఇన్నోవా క్రిస్టాను విడుదల చేసింది. ఇప్పటి వరకు 1,81,000 వాహనాలను విక్రయించింది. 2009లో ఫార్చూనర్‌ మార్కెట్లోకి రాగా ఇప్పటి వరకు 1,41,000 అమ్మకాలు నమోదయ్యాయి. 2005లో ఇన్నోవాను మార్కెట్లోకి తెచ్చామని, ఎంపివి సెగ్మెంట్లో ఇది నాయకత్వ స్థానాన్ని కొనసాగించిందని టికెఎం డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రాజా తెలిపారు. 

ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫార్చూనర్‌ పాపులర్‌ వాహనంగా నిలిచిందన్నారు. కస్టమర్ల కోరిక మేరకు మరిన్ని భద్రతా వసతులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వీటిలో ప్యాసెంజర్‌ సైడ్‌ పవర్‌ సీట్‌, గ్లాస్‌ బ్రేక్‌తో కూడిన యాంటీ థెఫ్ట్‌ అలారమ్‌, అల్ర్టాసోనిక్‌ సెన్సార్‌ వంటివి ఉన్నాయని ఎన్ రాజా పేర్కొన్నాన్నారు. ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫార్చూనర్‌ మార్కెట్‌ వాటా 70 శాతానికి పైగా ఉందని రాజా చెప్పారు.

తాజాగా అప్ డేట్ చేసిన మూడు రకాల మోడల్ కార్లలో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిగ్నల్‌తోపాటు రేర్ ఫాగ్ ల్యాంప్, ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, యాంటీ థెప్ట్ అలారంతోపాటు గ్లాస్ బ్రేక్ అండ్ అల్ట్రా సోనిక్ సెన్సార్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ మోడల్ కారులో అదనంగా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పడిల్ ల్యాంప్స్‌తోపాటు పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్, సెన్సిటివ్ డోర్ లాక్, అన్ లాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉన్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios