Asianet News TeluguAsianet News Telugu

హ్యుండాయ్ టు మారుతి.. దూసుకెళ్లనున్న విద్యుత్ కార్లివే

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ సమూల మార్పులకు వేదిక కానున్నది. అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలు సంప్రదాయ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్ వినియోగ కార్ల వినియోగం దిశగా పరివర్తన చెందేందుకు రంగం సిద్ధమైంది. దేశీయ కార్ల తయారీ కంపెనీలు కూడా విద్యుత్ కార్ల తయారీపైనా కేంద్రీకరించనున్నాయి. 

Top Upcoming Electric Vehicles to Launch in India by 2020: Hyundai Kona, Maruti Suzuki Wagon R EV and More
Author
New Delhi, First Published Jul 6, 2019, 11:05 AM IST

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ సమూల మార్పులకు వేదిక కానున్నది. అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలు సంప్రదాయ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్ వినియోగ కార్ల వినియోగం దిశగా పరివర్తన చెందేందుకు రంగం సిద్ధమైంది. దేశీయ కార్ల తయారీ కంపెనీలు కూడా విద్యుత్ కార్ల తయారీపైనా కేంద్రీకరించనున్నాయి. భారతీయ రోడ్లపైకి అత్యధికంగా విద్యుత్ కార్లను తీసుకొచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వ సహకారంపైనా ద్రుష్టి పెట్టాయి. భారత ఆటోమొబైల్ పరిశ్రమలో సమూల నాంది పలికేందుకు ఈ నెల నుంచి వచ్చే ఏడాది వరకు మార్కెట్లోకి రానున్న విద్యుత్ కార్లను ఒక్కసారి పరిశీలిద్దామా.. 

 

తొమ్మిదో తేదీన విపణిలోకి హ్యుండాయ్ ‘కోనా’
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ విద్యుత్ కారు‘కోనా’ఈ నెల తొమ్మిదో తేదీన మార్కెట్లోకి రానున్నది. హ్యుండాయ్ ప్రకటన మేరకు భారతదేశంలో అడుగిడనున్న తొలి విద్యుత్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానున్నది. దీని ధర రూ.25-30 లక్షలు పలుకుతుందని అంచనా. 39.2 కిలోవాట్ల లిథియం ఐయాన్ బ్యాటరీ ప్లాన్ కల ఈ కారు 134.13 బీహెచ్పీ, 395 ఎన్ఎం పవర్ ఆఫర్ చేస్తోంది. సింగిల్ చార్జింగ్‌తో 312 కిలోమీటర్లు పరుగులెత్తడం దీని ప్రత్యేకత. కేవలం 54 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ చేసే సామర్థ్యం గల 100 కెవీ డీసీ ఫాస్ట్ చార్జర్ కూడా దీనికోసం అందుబాటులో ఉంటుంది. 

డిసెంబర్‌లో ‘ఎంజీ’ ఈజడ్ఎస్ ఆవిష్క్రుతం
ఎంజీ మోటార్ ఇండియా తన తోలి విద్యుత్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘ఈజడ్ఎస్’ను డిసెంబర్‌లోగా విపణిలో విడుదల చేయనున్నది. 150 హెచ్పీ గల ఈ ఎలక్ట్రిక్ మోటార్ కారు 3.1 సెకన్లలో 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. న్యూ యూరోపియన్ డ్రైవింగ్ సైకిల్ (ఎన్ఈడీసీ) ప్రకారం ఎంజీ ఈజడ్ఎస్ కారు సింగిల్ చార్జింగ్‏తో 335 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లనున్నది. దీని ధర రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. 

 

రెవోల్ట్ విద్యుత్ మోటారు సైకిల్ ఆర్వీ 400
రెవోల్ట్ మోటార్స్ నుంచి విపణిలోకి అడుగు పెట్టనున్న తొలి విద్యుత్ మోటారు సైకిల్ ఆర్వీ400. ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ ఎలక్ట్రిక్ మోటారు సైకిల్‌లో పలు యూనిక్ ఫీచర్లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సింథసైజ్డ్ సౌండ్స్, స్వాపబుల్ బ్యాటరీ లోకేషన్ నెట్ వర్క్ తదితర ఫీచర్లు లభిస్తాయి. ఈ నెలలోనే ఆర్వీ 400 మోటారు సైకిల్ విపణిలో అడుగు పెట్టనున్నది. ప్రతి ఒక్కరు కొనుగోలు చేయగల వెసులుబాటు గల మోటారు సైకిల్ ఇది. ధర కూడా ‘ప్లీసెంట్ సర్ ప్రైజ్’గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

 

ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్‌లో ‘ఈకేయూవీ100’
ఈ ఏడాది ఫెస్లివ్ సీజన్‌లో దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ‘ఈకేయూవీ100’ మోడల్ కారును ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.7-9 లక్షల వరకు పలుకుతుంది. రెగ్యులర్ వర్షన్ కేయూవీ 100 మాదిరిగానే కనిపిస్తుంది. కాకపోతే డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. లిథియం ఐయాన్ బ్యాటరీతో నడిచే 31 కిలోవాట్ల విద్యుత్ మోటార్ నుంచి మూడు ఫేస్‌ల్లో ఏసీ ఇండక్షన్ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. సింగిల్  140 కి.మీ దూరం ప్రయాణించొచ్చు. గంటలోపే 80 శాతం ఫాస్ట్ చార్జింగ్ వెసులుబాటు కూడా ఉంటుంది. 

 

వచ్చే ఏడాది విపణిలోకి మారుతి వాగన్ఆర్ ఈవీ 
వచ్చే ఏడాది తొలి విద్యుత్ కారును మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తెలిపింది. వాగన్ ఆర్ ఈవీ పేరుతో అభివ్రుద్ది చేసిన విద్యుత్ వినియోగ కారును ఢిల్లీలో గతేడాది జరిగిన మూవ్ గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్‌లో ఆవిష్కరించింది. లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ కారు సింగిల్ చార్జితో సుమారు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంచనా. కారు ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ వివరాలేమీ మారుతి సుజుకి వెల్లడించలేదు. ఈ కారు ధర రూ.7 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. 

 

సింగిల్ చార్జింగ్‌తో ‘నిస్సాన్ లీఫ్’ 400 కి.మీ ప్రయాణం ఈజీ
ఈ ఏడాది జనవరిలోనే అత్యున్నత స్థాయిలో విజయవంతమైన ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘లీఫ్’ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ‘నిస్సాన్ లీఫ్’ ఒకటి. 40 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే 400 కి.మీ వరకు ఏకబిగిన ప్రయాణం చేయొచ్చు. అయితే పవర్ కెపాసిటీ కూడా కీలకమే సుమా. కనీసం ఎనిమిది గంటల నుంచి 16 గంటలపాటు బ్యాటరీని రీచార్జీ చేయాల్సి ఉటుంది. క్విక్ చార్జింగ్ ఫీచర్ కూడా లీఫ్ మోడల్ కారులో అందుబాటులో ఉంది. ఇది 40 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ రీచార్జి కావడానికి దోహద పడుతుంది. అయితే దీని ధర సుమారు రూ.30-35 లక్షలు ఉంటుందని అంచనా. 
 

Follow Us:
Download App:
  • android
  • ios