వర్షాకాలంలో డ్రైవింగ్ చేసే వారు దీని గురించి తెలుసుకోవాలి; రతన్ టాటా భిన్నమైన విజ్ఞప్తి
వర్షాకాలంలో జంతువులు అక్కడక్కడా తరచుగా ఆశ్రయం పొందుతూ కనిపిస్తాయి. వర్షం నుండి తడవకుండా వాహనాల కింద లేదా దుకాణాల ముందు తల దాచుకునేందుకు చేరుతుంటాయి. ఇలాంటి సమయంలో వాహనం కింద పడుకుని ఉన్న వీధి కుక్కలు, జంతువులును డ్రైవర్ గమనించకుంటే గాయపడతాయి.
భారతీయ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ప్రజలకు చాలా భిన్నమైన విజ్ఞప్తితో ముందుకు వచ్చారు. తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రతన్ టాటా వర్షాకాలంలో జంతువులపై దయ చూపాలని అభ్యర్థించారు. ఈ హృదయపూర్వక పోస్ట్‌లో, వర్షాకాలంలో జీవులకు ఆశ్రయం కల్పించడంపై ప్రాముఖ్యతను రతన్ టాటా నొక్కిచెప్పారు. వర్షాకాలంలో వాహనదారులు ఎం తెలుసుకోవాలో రతన్ టాటా సోషల్ మీడియాలో షేర్ చేసారు.
వర్షాకాలం మొదలైంది. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఎంతో మంది జీవితాలను కోల్పోవడం మనం కళ్ల ముందు చూస్తున్నాం. వర్షాకాలం వచ్చిందంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రాణభయం మొదలవుతుంది. రోడ్డుపై కుక్కలు లేదా జంతువులు, పక్షుల మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. 85 ఏళ్ల రతన్ టాటా జంతు హక్కులు ఇంకా వాటి రక్షణ గురించి అవగాహన పెంచే ఎన్నో పోస్ట్‌లను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంటారు. వీధికుక్కలు, జంతువుల గురించి రతన్ టాటా పోస్ట్‌లు ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
వర్షాకాలంలో వీధి జంతువుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వర్షాకాలంలో జంతువులు అక్కడక్కడా తరచుగా ఆశ్రయం పొందుతూ కనిపిస్తాయి. వర్షం నుండి తడవకుండా వాహనాల కింద లేదా దుకాణాల ముందు తల దాచుకునేందుకు చేరుతుంటాయి. ఇలాంటి సమయంలో వాహనం కింద పడుకుని ఉన్న వీధి కుక్కలు, జంతువులును డ్రైవర్ గమనించకుంటే గాయపడతాయి. దీనిని నివారించాలంటే వర్షాకాలంలో బయట సంచరించే జంతువులకు తాత్కాలిక షెల్టర్లు సిద్ధం చేయాలని రతన్ టాటా చెబుతున్నారు. అంతేకాకుండా, వర్షాకాలంలో వాహనాన్ని స్టార్ట్ చేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి ముందు వాహనాన్ని కింద చెక్ చేయాలని రతన్ టాటా వాహనదారులను కోరారు.
ఇలా చెక్ చేయకుండా నడపడం వల్ల వాహనాల కింద నిద్రిస్తున్న కుక్కలు, జంతువులకు ప్రమాదం వాటిల్లుతుంది. అవి వికలాంగులు కావచ్చు లేదా ఒకోసారి చనిపోవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసే ముందు వాహనం కింద భాగాన్ని చెక్ చేయండి అని రతన్ టాటా అన్నారు. రతన్ టాటా చేసిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 14 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.