Asianet News TeluguAsianet News Telugu

యువతే లక్ష్యం: మార్కెట్లోకి టాటా ‘ట్విన్’ రేస్ కార్లు.. రూ.11వేలకే బుకింగ్

ఇప్పటివరకు సంప్రదాయ కార్లు, వాహనాలనే ఉత్పత్తి చేస్తున్న టాటా మోటార్స్ ఇటీవలి కాలంలో స్పీడ్ పెంచింది. ఎస్ యూవీ, కంపాక్ట్, సెడాన్ మోడళ్ల కార్ల తయారీని ప్రారంభించిన టాటా మోటార్స్ తాజాగా జయేం ఆటోమోటివ్స్ సంస్థతో కలిసి రేసింగ్ కార్లను మార్కెట్లో ఆవిష్కరించింది. సెకన్లలో 100 కి.మీ స్పీడందుకోవడం వీటి స్పెషాలిటీ.

Tata Tiago JTP, Tigor JTP Launched In India; Prices Start From  6.39 Lakh
Author
New Delhi, First Published Oct 27, 2018, 10:37 AM IST

న్యూఢిల్లీ/ కోయంబత్తూర్: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఇటీవల స్పీడ్ పెంచింది. జయం ఆటోమేటివ్స్‌ సంయుక్త సంస్థ జేటీ స్పెషల్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌తో కలిసి రేసింగ్ కార్ల విభాగంలోకి దూసుకొచ్చింది. ప్రధానంగా టాటా మోటార్స్ జేటీపీ బ్రాండ్‌ కింద ‘టియాగో జేటీపీ’, ‘టిగోర్‌ జేటీపీ’ మోడల్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. టియాగో, టిగోర్‌ జేటీపీ బ్రాండ్‌ కార్ల ప్రారంభ ధరలు రూ.6.39-7.49 లక్షలుగా నిర్ణయించింది.

అర్బన్ కస్టమర్లను ప్రత్యేకించి యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త రకం కార్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. వచ్చే నెల ప్రారంభంలో ఎంపిక చేసిన 30 డీలర్ల వద్ద ఇవి అందుబాటులో ఉంటాయని టాటా మోటార్స్‌ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు 15 నగరాల పరిధిలో పరిమితంగా కార్లు విడుదల చేస్తున్నట్లు టాటా మోటార్స్ ధ్రువీకరించింది. ఈ రేసింగ్ కార్ల కొనుగోలు కోసం ముందస్తుగా రూ.11,000 చెల్లించి బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. 

‘పట్టణాలు, నగరాల్లో ఈ కార్ల డ్రైవింగ్‌ను ఆనందించడంతో పాటు మంచి అనుభూతి పొందవచ్చ’ని టాటా మోటార్స్‌ ప్యాసింజర్స్ వెహికల్స్ విభాగం అధ్యక్షుడు మయాంక్‌ పరీఖ్‌ తెలిపారు. ఇవి టాటా మోటార్స్‌, కోయంబత్తూరుకు చెందిన జయేం మోటార్స్‌ భాగస్వామ‍్యంతో మార్కెట్‌లోకి ప్రవేశించిన తొలి కార్లు. రెండు వేరియంట్ కార్లను డ్రైవింగ్‌లో తేలిగ్గా నియంత్రించవచ్చు. 

ఈ రెండు కార్లు 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్‌ న్యూ జనరేషన్‌  రివోట్రోన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. సిటీ, స్పోర్ట్‌ తరహా డ్రైవింగ్‌ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. గంటకు 160 కి.మీ వేగం, 10 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకతలు. వీటిలో ఏర్పాటు చేసిన 114 బీహెచ్పీ పీక్‌ పవర్‌ని అందిస్తాయి. 8-స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టం, అల్యూమినియం పెడల్స్, 5000 ఆర్పీఎంతో, 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇతర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 
ఇంకా అగ్రెస్సివ్ ఫ్రంట్ బంపర్, పొడవైన ట్రేపెజైడల్ లోయర్ గ్రిల్, డ్యుయల్ చాంబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తోపాటు 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉన్న కార్లు ఇవి. టియాగో జేటీపీ, టిగోర్ జేటీపీ మోడల్ కార్లలో డ్యుయల్ బ్యాగ్, ఏబీఎస్, ఈబీడీ, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వసతులు అందుబాటులో ఉంటాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios