టాటా మోటార్స్ ప్రతిష్ఠాత్మక కారు ‘టాటా నానో’ లేదంటే ‘జయేం నియో’ విద్యుత్ వారియంట్ మోడల్ కొనుగోలు చేసేవారికి రూ.1.24 లక్షల మేరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనున్నది. ప్రారంభంలో హైదరాబాద్ నగరంలో ఓలా క్యాబ్స్ సంస్థకు 400 జయేం నియో కార్లను టాటా మోటార్స్ విక్రయిస్తోంది. 

కోయంబత్తూరు కేంద్రంగా పని చేస్తున్న కార్ల తయారీ సంస్థ జయేం ఆటోమోటివ్స్.. టాటా నానో కారుకు విద్యుత్ వర్షన్ కారును ఉత్పత్తి చేస్తోంది. దీనికి జయేం నియో అని పేరు పెట్టారు. టాటా నానో విద్యుత్ కారును ‘జయేం నియో’ బ్రాండ్ పేరు పెడతారు. కానీ దీన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ప్రారంభంలో వ్యక్తిగతంగా, కుటుంబ వాహనానికి ఉపయోగించడానికి వీలు కాకపోవచ్చు. 

టాటా నానో అలియాస్ జయేం ఆటో సంస్థకు ప్రభుత్వం రూ.1.24 లక్షలు చెల్లిస్తుంది. ఇది మహీంద్రా ఈ-20, టాటా టిగార్ ఎలక్ట్రిక్ వాహనాలతో ఈ జయేం నియో మోడల్ కారు పోటీ పడబోతుంది. మార్కెట్ లోకి వచ్చిన మరుక్షణం హైదరాబాద్ నగరంలో జయేం నియో కారు పరుగులు తీయనున్నది. 

అంతేకాదు జయేం ఆటో సంస్థ ‘నియో’ మోడల్ కారులో కొన్ని మార్పులు తీసుకురానున్నది. ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ డిజైన్లలో మార్పులు తీసుకొస్తుంది. ఇంతకుముందు టాటా నానో మోడల్ కారుతో పోలిస్తే జయేం నియో మోడల్ కారులో పలు ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, రిమోట్ సాయంతో సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఎయిర్ కండీషనింగ్, బ్లూటూత్, ఆక్స్ -ఐెన్, 12 వీ పవర్ సాకెట్ కూడా లభిస్తాయి. 

జయేం నియో విద్యుత్ కారు 23 బీహెచ్పీ పవర్ తోపాటు 48 వోల్టుల విద్యుత్ మోటార్ అందుబాటులో ఉంటుంది. 800 కిలోల కెర్బ్ వెయిట్‌తోపాటు ఆరాయి రేటింగ్స్ ప్రకారం ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే నలుగురు ప్రయాణికులతో 200 కి.మీ వరకు 140 కిమీ వరకు ఎయిర్ కండీషనింగ్ సౌకర్యంతో ప్రయాణం చేయచ్చు. కాకపోతే ఈ టాటా నానో విద్యుత్ కారు ధర సుమారు రూ.5 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.