Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ వాహనాలు, గ్రామాలే ‘టాటామోటార్స్’ టార్గెట్ !!

ప్రయాణికుల వాహనాల విభాగంలో ఇంప్రెస్సివ్ మార్కెట్ షేర్ కలిగి ఉన్న టాటా మోటార్స్ తాజాగా విద్యుత్ వాహనాల్లో బిజినెస్ అవకాశాలు గల మొబిలిటీ, ఫ్లీట్, పర్సనల్ వెహికల్స్ విభాగంలో గ్రామీణ మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది.

Tata Motors to focus on EVs, shared mobility & rural market
Author
Mumbai, First Published Sep 14, 2018, 8:12 AM IST

ప్రయాణికుల వాహనాల విభాగంలో ఇంప్రెస్సివ్ మార్కెట్ షేర్ కలిగి ఉన్న టాటా మోటార్స్ తాజాగా విద్యుత్ వాహనాల్లో బిజినెస్ అవకాశాలు గల మొబిలిటీ, ఫ్లీట్, పర్సనల్ వెహికల్స్ విభాగంలో గ్రామీణ మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రతి సెగ్మెంట్‌లో ప్రత్యేక ఉత్పత్తి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని తలపోస్తున్నది.

టాటా మోటార్స్ రెండు రోజుల క్రితం టియాగో ఎన్నార్జీ మోడల్ కారు ఆవిష్కరణ సందర్భంగా సంస్థ ప్యాసింజర్స్ వెహికల్స్ డివిజన్ అధ్యక్షుడు మయాంక్ పరీక్ మాట్లాడుతూ వ్యక్తిగత వాహనాల కొనుగోలుదారులపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించామన్నారు. పురోగతి అవకాశాలను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 

దేశీయంగా 1500 పాయింట్లకు విస్తరించాలని ప్లాన్
వివిధ రంగాల కొనుగోలు దారుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రకాల, మోడల్ కార్లను తీసుకొచ్చి కొనుగోలుదారులను సంత్రుప్తి పర్చడమే తమ లక్ష్యమని మయాంక్ పరీక్ చెప్పారు.

వ్యక్తిగత వినియోగదారుల కోసం టియాగో, టైగోర్ మోడల్ విద్యుత్ కార్లు, మొబిలిటీ సెగ్మెంట్ల కోసం జెస్ట్, బోల్ట్ మోడల్ కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. టాటా మెయిన్ స్ట్రీం మోడల్స్ టియాగో, టైగోర్, నెక్సన్ తదితర కార్లు జేటీపీ సబ్ బ్రాండ్ కింద ఉత్పత్తి చేస్తున్నది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1500 పాయింట్లకు విస్తరించాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకున్నది. 

ఎగుమతులు పెరిగినా తరగని వాణిజ్య లోటు
ఆగస్టులో దేశీయ ఎగుమతులు రికార్డు స్థాయిలో 19.21 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. ఎగుమతుల విలువ 27.84 బిలియన్ డాలర్లు. ఇదే సమయంలో దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 25.41 శాతం ఎగబాకి 45.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఇంధన ధరలు భగ్గుమనడం దిగుమతులు భారీగా పెరుగడానికి ప్రధాన కారణమని చెప్పారు. దీంతో వాణిజ్యలోటు 17.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జూలై నెలలో వాణిజ్య లోటు ఐదేండ్ల గరిష్ఠ స్థాయి 18.02 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఎగుమతుల్లో 16.13 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, దిగుమతుల్లో 17.34 శాతం ఎగబాకాయి.

10 నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం పది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆహార ఉత్పత్తుల్లో ముఖ్యంగా ఫలాలు, కూరగాయల ధరలు భారీగా తగ్గడంతో ఆగస్టు నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదైంది.జూలైలో 4.17 శాతంగా నమోదైన గణాంకాలు, 2017 ఆగస్టులో నమోదైన 3.28 శాతంతో పోలిస్తే మాత్రం స్వల్పంగా పెరిగింది.

గతేడాది అక్టోబర్‌లో ఇది 3.58 శాతంగా ఉన్నది. ఇంధన ధరలు భారీగా పెరిగినా ద్రవ్యోల్బణ గణాంకాలు పది నెలల కనిష్ఠానికి పడిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆగస్టు 16 వరకు ఉన్న ధరల ఆధారంగా ఈ గణాంకాలను విడుదల చేసినట్లు డాటా వెల్లడించింది. మరోవైపు రూపాయి పతనమవుతుండటంతో దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios