showroom on wheels:ఇక మీ ఇంటి వద్దే కార్ల షాపింగ్ చేయవచ్చు, టాటా మోటార్స్ సరికొత్త ఆలోచన..

భారతదేశంలోని గ్రామాల్లో టాటా మోటార్స్ బ్రాండ్‌పై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా 103 మొబైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొబైల్ షోరూమ్ ప్రస్తుత డీలర్‌లు వినియోగదారులకు డోర్-స్టెప్ షాపింగ్ అనుభూతిని అందించడంలో సహాయపడుతుంది. 

Tata Motors launches 'showroom on wheels' for doorstep car buying. Know what it is

దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (tata motors) 'అనుభవ్-షోరూమ్ ఆన్ వీల్స్'ను ప్రారంభించింది. దీని ద్వారా గ్రామీణ వినియోగదారులకు ఇంటి వద్దే కార్ షాపింగ్ అనుభూతిని అందిస్తుంది. గ్రామాలలో  సంస్థ మార్కెటింగ్ వ్యూహానికి అనుగుణంగా ఈ చొరవ తహసీల్‌లు, తాలూకాలలో కంపెనీ పరిధిని పెంచడానికి సహాయపడుతుంది. గ్రామీణ జనాభా ఆర్థిక వ్యవస్థ పరంగా తహసీల్‌లు, తాలూకాలకు అపారమైన సామర్థ్యం ఉంది. 

భారతదేశంలోని గ్రామాల్లో టాటా మోటార్స్ బ్రాండ్‌పై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా 103 మొబైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొబైల్ షోరూమ్ ప్రస్తుత డీలర్‌లు వినియోగదారులకు డోర్-స్టెప్ షాపింగ్ అనుభూతిని అందించడంలో సహాయపడుతుంది. ఈ చొరవ కొత్త ఫరెవర్ రేంజ్ కార్లు, ఎస్‌యూ‌విలు, అసెసోరిస్ గురించి సమాచారాన్ని అందించడంలో తోడ్పడుతుంది. దీంతో వినియోగదారులు ఆర్థిక స్కీమ్ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే టెస్ట్ డ్రైవ్‌ను కూడా బుక్ చేయవచ్చు ఇంకా ఎక్స్ ఛేంజ్ కోసం సిద్ధంగా ఉన్న కార్లను అంచనా వేయవచ్చు. 

తద్వారా వారికి మన పరిధిని మరింత విస్తరించవచ్చు. భారతదేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో గ్రామీణ భారతదేశంలోని విక్రయాలు 40 శాతంగా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్‌తో గ్రామీణ మార్కెట్‌లలో మా పరిధిని మరింత విస్తరింపజేయగలమని ఇంకా మా వినియోగదారులను కూడా పెంచుకుంటామని మేము విశ్వసిస్తున్నాము అని సంస్థ తెలిపింది.

టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్  ఫుల్లీ బిల్ట్ వెహికల్స్ (FBV) విభాగం  నైపుణ్యంతో అత్యంత విశ్వసనీయమైన టాటా ఇంట్రా V-10లో వీల్స్ పై అనుభవపూర్వకమైన షోరూమ్ అభివృద్ధి చేసింది. మొబైల్ షోరూమ్‌లను టాటా మోటార్స్ పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో డీలర్‌షిప్‌లు నిర్వహిస్తాయి. అన్ని డీలర్‌షిప్‌లు ఈ వ్యాన్‌ల కోసం ప్రతినెల మార్గాలను నిర్ణయిస్తాయి, తద్వారా టార్గెట్ గ్రామం లేదా తహసీల్‌ను కవర్ చేయగలరు. ఈ మొబైల్ షోరూమ్‌లు జి‌పి‌ఎస్ ట్రాకర్‌లతో అమర్చబడి ఉంటాయి, దీని ద్వారా వాటి కదలికను మెరుగైన ఉపయోగం కోసం పూర్తిగా పర్యవేక్షించవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios