భారత్ మార్కెట్‌లోకి రెండు సుజుకీ ఆఫ్‌రోడ్‌ బైక్‌లు

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 4, Oct 2018, 1:34 PM IST
Suzuki RM-Z250, RMZ-450 Launched In India
Highlights

భారతీయ యువతలో రైడింగ్‌లో సాహసాలకు ప్రాధాన్యం ఇచ్చే ధోరణి పెరుగుతోంది. తదనుగుణంగా దేశీయ మార్కెట్‌లోకి సుజుకి మోటార్ సైకిల్ ఇండియా రెండు ఆఫ్ రోడ్ బైక్‌లను ఆవిష్కరించింది.

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా దేశీయ మార్కెట్‌లో రెండు గ్లోబల్‌ ఫ్లాగ్‌షిప్‌ ఆఫ్‌రోడ్ బైక్‌లను విడుదలచేసింది. ఆర్‌ఎం–జెడ్‌ 250 మోడల్  బైక్‌ ధర రూ.7.10 లక్షలు కాగా, ఆర్‌ఎం–జెడ్‌ 450 మోడల్‌ ధర రూ.8.31 లక్షలని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఆఫ్ రోడ్ సామర్థ్యం గల ఆఫ్ రోడ్ బైక్‌లతో బురదలోనూ, దుమ్ములోనూ అలవోకగా, వేగంగా, చురుగ్గా దూసుకెళ్లవచ్చు. అయితే రెండు బైక్‌లతో చట్టబద్ధంగా ప్రధాన రోడ్లపై పరుగులు తీయడానికి నిషేధం. ట్రాఫిక్ మధ్య గానీ, పబ్లిక్ రోడ్లపై గానీ ఈ వాహనాలతో ప్రయాణించరాదు.

ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతోషి ఉచిదా మాట్లాడుతూ.. ‘ కొంత కాలంగా భారత్‌లో ఆఫ్‌–రోడ్ విభాగం బైక్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. సాహసోపేతమైన రైడింగ్‌ కోరుకునేవారి సంఖ్య ఊపందుకుంటోంది. ఈ కారణంగానే నేటితరం యువత అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకున్న ఈ బైక్‌లను విడుదలచేశాం.’ అని వ్యాఖ్యానించారు.  ఆర్ఎంజడ్ సిరీస్‌లో విలక్షణమైన డిజైన్ తో రూపుదిద్దుకున్న వాహనాలతో థ్రిల్ అయ్యామన్నారు. 

సుజుకి ఆర్ జడ్ 450 మోడల్ బైక్ 449 సీసీ ఫోర్ స్ట్రోక్, ఇంధన సాయంతో నడిచే డీఓహెచ్సీ ఇంజిన్‌ను అమర్చారు. వీటికి అదనంగా సుజుకి హోల్ షాట్ అసిస్టెంట్ కంట్రోల్ (ఎస్-హెచ్ఏసీ)ను అనుసంధానం చేశారు. రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా నడిపేందుకు ఎంపిక చేసిన మూడు మోడల్స్ లో ఈ ఆర్ఎంజడ్ 450 మోడల్ బైక్ సిద్ధంగా ఉంది. నూతన బ్యాలెన్స్ ఫ్రీ రేర్ కుషన్ (బీఎఫ్ఆర్సీ) టెక్నాలజీని దత్తత చేసుకున్న తొలి మోటార్ బైక్ ఆర్ఎంజడ్ 450. 

అంతే కాదు ఆర్ఎంజడ్ 450 మోటార్ బైక్ 21 అంగుళాల ఫ్రంట్ వీల్, 18 అంగుళాల రేర్ వీల్‌తోపాటు 330ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తోపాటు 112 కిలోల బరువు కలిగి ఉంటుంది. 249 సీసీ సామర్థ్యం గల సుజుకి ఆర్ఎంజడ్250 మోడల్ బైక్‌కు సుజుకి ఆర్ఎం-జడ్450 మోడల్ బైక్ లక్షణాలు ఉన్నాయి. 345ఎంఎం సామర్థ్యం గల గ్రౌండ్ క్లియరెన్స్ తోపాటు 106 కిలోల బరువు ఉంటుంది. 

loader