Asianet News Telugu

రెనాల్డ్ గ్లోబల్ ఎఫైర్స్‌కు సుమిత్ సావ్నాయ్.. ఇండియాకు వెంకట్రాం మామిళ్లపల్లి

‘క్విడ్’ మోడల్ చిన్నకారుతోనే మారుతి సుజుకి, హ్యుండాయ్ సంస్థలకు సవాల్ విసిరిన రెనాల్డ్ ఇండియా ఎండీ సుమిత్ సావ్నాయ్.. ప్రమోషన్‌తో సంస్థ గ్లోబల్ ఎఫైర్స్‌లోకి వెళ్లనున్నారు. సావ్నాయ్ స్థానంలో టాటామోటార్స్, జనరల్ మోటార్స్ తదితర సంస్థల్లో పని చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెంకట్రామ్ మామిళ్లపల్లి వచ్చేనెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. 

Sumit Sawhney, Renault India MD moves to global role, Venkatram Mamillapalle to take over from March
Author
Hyderabad, First Published Feb 5, 2019, 3:20 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సావ్నాయ్ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి సంస్థ గ్లోబల్ ఎఫైర్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. సుమిత్ సావ్నాయ్ స్థానంలో టాటా మోటార్స్ అండ్ దక్షిణ కొరియా జనరల్ మోటార్స్ సోర్సింగ్ మాజీ హెడ్ వెంకట్రామ్ మామిళ్లపల్లి బాధ్యతలు స్వీకరిస్తారు. 

రెనాల్ట్ ఇండియా ఎండీగా ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు సుమిత్ సావ్నాయ్. భారతదేశంలోని మల్టీ నేషనల్ సంస్థకు అత్యధిక కాలం అధిపతిగా వ్యవహరించిన ఎగ్జిక్యూటివ్‌గా సుమిత్ సావ్నాయ్ నిలిచారు. ఆయన రెనాల్ట్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇండియా అధిపతిగా ఫాబ్రికె కాంబోలివ్ ఆధ్వర్యంలోని ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోనూ కొనసాగుతారు. 

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న యూరోపియన్ యూనియన్ బ్రాండ్‌గా రెనాల్డ్ క్విడ్ సక్సెస్‌ఫుల్‌గా నిలిచింది. సుమిత్ సావ్నాయ్ సారథ్యంలో రెనాల్డ్ ఇండియా.. భారతదేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలుగా ఉన్న మారుతి సుజుకి, హ్యుండాయ్ సంస్థలకు క్విడ్ మోడల్ కారుతో సవాల్ విసిరారు. 

సుమిత్ సామ్నాయ్ స్థానంలో రెనాల్ట్ ఇండియా ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న వెంకట్రామ్ మామిళ్లపల్లి తమిళనాడులోని మదురైలోని మదురై కామరాజ్ యూనివర్శిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రొక్యూర్‌మెంట్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సప్లయి‌చెయిన్ మేనేజ్‌మెంట్, వెండార్ డెవలప్ మెంట్, లాజిస్టిక్స్, సప్లయర్ మాన్యుఫాక్చరింగ్ డిజైన్ విభాగాల్లో సుసంపన్నమైన ఎక్స్ పీరియన్స్ కలిగి ఉన్న ఎగ్జిక్యూటివ్. 

టాటామోటార్స్ పర్చేజింగ్ అండ్ సప్లయ్ చైన్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా, జనరల్ మోటార్స్ కొరియా పర్చేజింగ్ అండ్ సప్లయి చైన్ ఉపాధ్యక్షుడిగా, లంబోర్గిని ఇండియా, డెల్పీ ఆటోమోటివ్ సిస్టమ్స్, ఎచిర్ ట్రాక్టర్స్ సంస్థల్లో వెంకట్రామ్ మామిళ్లపల్లి పని చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios