Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగుల్లో గుబుల్ .. లక్షకు పైగా జాబ్స్ తూచ్!

దేశీయ ఆటో పరిశ్రమం సంక్షోభం, ఇతర రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఆటో రంగంలో ఉత్పత్తి 13% క్షీణతను నమోదు చేసింది.

Sluggish demand in H1: Auto components sales fall record 10% to Rs 1.87 lakh crore
Author
Hyderabad, First Published Dec 8, 2019, 4:15 PM IST

ముంబై: దేశీయ ఆటో పరిశ్రమం సంక్షోభం, ఇతర రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఆటో రంగంలో ఉత్పత్తి 13% క్షీణతను నమోదు చేసింది. డిమాండ్ తగ్గడం, ఆర్థికమందగనం వల్ల పలు సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి ప్లాంట్లను తాత్కాలికంగా మూసేశాయి.

దీంతో ఆటోమొబైల్ రంగంలోనూ ఉద్వాసనలకు తెర లేచింది.  అంతేకాదు ఈ ప్రభావంతో ఆటో స్పేర్స్‌లో ఈ ఏడాది జూలై నాటికి  లక్ష మంది తమ తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయారని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) తెలిపింది.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే....

ఊహించనంత కాలం కొనసాగుతున్న సుదీర్ఘమైన మందగమనం  వాహన పరిశ్రమను దెబ్బ తీస్తున్నదని, అమ్మకాలు బాగా తగ్గాయని, ఇది ఇతర సెగ్మెంట్లను దెబ్బతీస్తోదని అసోసియషన్‌ ప్రెసిడెంట్ దీపక్ జైన్ చెప్పారు. 

ఆటోమొబైల్ రంగంలో 2013-14 తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులేర్పడ్డాయని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడు దీపక్ జైన్ తెలిపారు. ముఖ్యంగా ఆటో  ఉత్పత్తి తగ్గడంతో విడిభాగాల పరిశ్రమ సామర్థ్య వినియోగం 50%పడిపోయినట్లు తెలిపింది. గతంలో ఇది గరిష్టంగా 80% నమోదైందన్నారు.

భారతదేశపు 57 బిలియన్ డాలర్ల ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ, దేశ జీడీపీలో 2.3 శాతం వాటా కలిగి ఉంది.  50 లక్షల మందికి ఉద్యోగులను కలిగి ఉంది. ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ గత ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య రూ.1.99 లక్షల కోట్లుగా ఉంది.

63వేల కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి...కారణం ?

అంటే ఆటో రంగ అనుబంధ పరిశ్రమల టర్నోవర్ ఈ ఏడాది ఇదే కాలంలో 10.1 శాతం తగ్గి రూ.1.79 లక్షల కోట్లుగా ఉందని అసోసియేషన్‌ పేర్కొంది. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నిలిచిపోయినట్లు పేర్కొంది. ఎగుమతులు మాత్రం 2.7శాతం పెరిగి రూ.51,397 వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయని ఏసీఎంఏ తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios