రాయల్ ఎన్‌ఫీల్డ్... ఒకప్పుడు రాజసంగా భారత రోడ్లపై తిరిగిన బైక్. అయితే తన జోరు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది. తమ బ్రాండ్ వాల్యూ ఎలాంటిదో మరోసారి నారూపించింది. ఈ కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ బైక్ ఇండియాలో కేవలం 178 సెకన్లనోనే తన సేల్ ని కంప్లీట్ చేసింది. అయితే ఈ బైక్ అత్యంత చవక ధరదని భావిస్తే మీరు పొరబడినట్లే. ఇప్పటివరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన బైక్ ఇదే.  ఇలా తన బ్రాండ్ ఇమేజ్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ రికార్డు సృష్టించింది. 

గతంలో రాయల్ ఎన్ పీల్డ్ బైక్ అంటే రాజసానికి మారుపేరుల నిలిచేది. దీన్ని చాలా మంది స్టేటస్ సింబల్ గా భావించేవారు. అయితే నూతనంగా వచ్చిన కంపనీలు, మార్కెట్ ప్రభావాన్ని తట్టుకోలేక కొన్నాళ్లు ఈ కంపెనీ తన ప్రాభవాన్ని కోల్పోయిన విషయం తెలసిందే. అయితే ఈ కంపెనీ తన పూర్వ వైభవాన్ని తీసుకురావడాని తాజాగా టూవీలర్స్ లవర్స్ ని ఆకట్టుకునే పనిలో పడింది. దీంతో వారిని ఆకట్టుకోడానికి  ''రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్'' వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.

అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాహనాలను ప్రపంచవ్యాప్తంగా కేవలం వెయ్యి మాత్రమే తయారుచేశారు. అందులో 250 బైక్ లను ఇండియా కోసం కేటాయించారు. వీటి కోసం బేధవారం సాయంత్రం ఆన్ లైన్ సేల్ ప్రారంభించగా కేవలం మూడు నిమిషాల కంటే తక్కువ సమయంలో అంటే 178 సెకన్లలోనే మొత్తం అమ్మడయ్యాయి. ఈ పెగాసస్ ధర రూ.2.4 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా రాయల్ ఎన్ పీల్డ్ నిర్ణయించింది. ఇప్పటివరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన బైకుల్లో ఇదే అత్యంత ఖరీదైన బైక్ కావడం విశేషం.