Asianet News TeluguAsianet News Telugu

మందగమనం ఉన్నా.. ప్రయాణ వాహన విక్రయాల్లో మోస్తరు వృద్ధి

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ప్రయాణ వాహనాల విక్రయాలు మోస్తరుగా అభివ్రుద్ధి సాధించాయి. తొలి అర్థ భాగంలో 6.8 శాతం అధికంగా అమ్ముడు పోయిన ప్రయాణ వాహనాలు.. రెండో త్రైమాసికంలో పెట్రోలియం ధరల పెరుగుదల ప్రభావం వాటి విక్రయాలపై గణనీయంగా పడింది.

PV sales growth witness moderate growth in H1 at 6.88%
Author
New Delhi, First Published Oct 13, 2018, 10:37 AM IST

న్యూఢిల్లీ: ఓ పక్క ఇంధన ధరలు మండుతున్నా దేశీయ మార్కెట్‌లో ఆటోమోటివ్‌ పరిశ్రమ అనూహ్య వృద్ధి కనబరుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో  1.41 కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత ఆటోమోటివ్‌ పరిశ్రమ 10.95 శాతం వృద్ధిని కనబర్చింది. ఇక ప్రయాణ వాహనాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల కాలానికి 6.88 శాతం పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి 1,27,56,611 వాహనాలు మాత్రమే అమ్ముడు పోయినట్లు భారత ఆటోమొబైల్‌ తయారీ దారుల సంఘం (సియామ్) తెలిపింది. కానీ సెప్టెంబర్ నెలలో వాహనాల విక్రయాలు 5.61 శాతం తగ్గిపోయాయి. ఇలా వరుసగా మూడో నెలలో వాహనాల విక్రయం తగ్గిపోవడం గమనార్హం..

ప్రయాణికుల రవాణా కోసం కొన్న చిన్న తరహా వాహనాలు 17,44,305 అమ్ముడయ్యాయి. కార్లు 11.69 లక్షలు విక్రయమై.. 6.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎస్‌యూవీ), యుటిలిటీ వెహికిల్స్‌ (యూవీ) 4.64 లక్షలు అమ్ముడు పోయి 5.42 శాతం వృద్ధి సాధించాయి. వ్యాన్లు వంటి కమర్షియల్‌ వాహనాల రంగంలో గణనీయమైన వృద్ధి కనబడింది. ఏతావాతా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో 37.82 శాతం వృద్ధి కనబడింది.

మధ్య, భారీ తరహా వాహనాలు 1.9 లక్షలు అమ్ముడు పోగా.. లైట్‌ కమర్షియల్‌ వాహనాలు రికార్డు స్థాయిలో 4.87 లక్షలు విక్రయమయ్యాయి. ఈ వాహనాల అమ్మకాల్లో వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని ఎస్‌ఐఏఎం అధ్యక్షుడు రాజన్‌ వెల్లడించారు. సెప్టెంబరు నెలలో విపరీతంగా పెరిగిన ఇంధన ధరల మూలంగా కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. భారత్‌లో పండుగ సీజన్‌ ఆలస్యంగా రావడం కూడా కార్ల అమ్మకాలు కొంత మందగించడానికి కారణమని ఆయన వెల్లడించారు. ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. స్కూటీలు కేవలం 5 శాతం వృద్ధి కనబర్చగా.. మోటారు సైకిళ్ల విక్రయాల వృద్ధి 13.18 శాతం నమోదైంది. స్కూటర్లు 37.53 లక్షలు.. మోటారు సైకిళ్లు 73.71 లక్షలు అమ్ముడుపోయాయి.

అయితే ప్రయాణ వాహనాల విక్రయం మాత్రం రెండో త్రైమాసికంలో 3.6 శాతం తగ్గుముఖం పట్టింది. అంతకుముందు తొలి త్రైమాసికంలో 20 శాతం పురోగతి నమోదుచేసింది. రెండో త్రైమాసికం తొలి నెల జూలైలో 2.71 శాతం విక్రయాలు తగ్గుముఖం పడితే, ఆగస్టులో 2.46 వాతం తగ్గిపోయాయి. గతేడాది 9-11 శాతం పురోగతి సాధిస్తే, ఈ ఏడాది 9 శాతం వ్రుద్ధి సాధిస్తామని సియామ్ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ను ద్రుష్టిలో పెట్టుకుని కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేయడంతో మోస్తరుగా 6.88 శాతం పురోగతి నమోదైంది. రెండో అర్థ భాగంలోనూ స్వల్పంగానైనా పురోగతి నమోదవుతుందని సియాం అధ్యక్షుడు రాజన్ వధేరా మీడియాకు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios