Asianet News TeluguAsianet News Telugu

చమురు ‘సురుక్కు’: సింగిల్ డిజిట్‌కే వెహికల్స్ సేల్స్

డాలర్ విలువపై రూపాయి పతనం.. వాణిజ్య యుద్ధం ప్రభావంతో ముడి చమురు ధరల పెరుగుదలతో వాహనాల కొనుగోలు దారుల్లో నెగిటివ్ సెంటిమెంట్ పెరిగింది. ప్రయాణ వాహనాల కొనుగోళ్లలో మందగమనం నమోదైందని ఆటోమొబైల్ రంగం ఆందోళన వ్యక్తం చేసింది.

Passenger vehicle sales in slow lane in September as high fuel cost, floods take toll
Author
Mumbai, First Published Oct 2, 2018, 8:01 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం.. డాలర్ బలోపేతం.. ఆ పై ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనుసరిస్తున్న విధానాలతో రూపాయి పతనం.. ఆ పై అంతర్జాతీయ మార్కెట్‌లో రోజు రోజుకూ కొండెక్కుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలతో సెప్టెంబర్‌లో దేశీయ వాహన విక్రయాల సంఖ్య తగ్గింది.

వాహన తయారీ సంస్థలు తయారు చేసిన వాహనాల విక్రయాలు సింగిల్ డిజిట్ కే పరిమితమైతే.. మరికొన్ని సంస్థల విక్రయాల్లో నెగిటివ్ గ్రోత్ నమోదైంది. ఇక కేరళను ముంచెత్తిన వరదలు వినియోగదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్‌, టొయాటొ కిర్లోస్కర్‌ సింగిల్ డిజిట్ వృద్ధిరేటు నమోదు చేశాయి. హ్యుందాయ్‌, మహింద్రా అండ్‌ మహింద్రా, ఫోర్ట్‌ సంస్థల కార్ల విక్రయాలు తగ్గిపోయాయి. మారుతీ తన విక్రయాల్లో గత నెల్లో 1,53,550 యూనిట్ల నుంచి కేవలం 1.4 శాతమే (1,51,400) పెరుగుదల కనిపించిందని తెలిపింది. స్విఫ్ట్‌, బాలెనో తదితర మోడళ్లలో పెరుగుదల ఉండగా మినీ సెగ్మెంట్‌, వ్యక్తిగత వినియోగ వాహనాల్లో తగ్గుదల నమోదైంది. 

టాటా మోటార్స్‌ 17,286 నుంచి 18,429 యూనిట్ల విక్రయాలతో 7 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబర్ నెలలో వాహనాల విక్రయాలు తగ్గుముఖం పడతాయని ముందే సంకేతాలు ఉన్నాయని టాటా మోటార్స్ ప్రయాణ వాహనాల బిజినెస్ విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీక్ తెలిపారు. 

మారుతి సుజుకికి సంబంధించి వినియోగదారులకు అట్రాక్టివ్ మోడల్ కారు ఆల్టో, వాగన్ ఆర్ మోడల్ కార్ల విక్రయాలు గత జూలైలో పోలిస్తే ఈ ఏడాది 38,479 యూనిట్ల నుంచి 34,971 కార్లకు పడిపోయింది. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, డిజైర్ తదితర సంస్థల విక్రయాల్లో 1.4 శాతం ప్రగతి నమోదైంది. యుటిలిటీ వాహనాలైన విటారా బ్రెజా, ఎస్ క్రాస్, ఎర్టిగా వాహనాల విక్రయాలు కూడా 8.7 శాతంతో 19,900 యూనిట్ల నుంచి 21,639 యూనిట్లకు పెంచకున్నది. 

కాకుంటే ద్విచక్ర వాహనాల విభాగంలో బజాజ్ ఆటో 11 శాతం పురోగతి నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే దేశీయంగా మోటార్ సైకిళ్లు 2,81,779 బైక్‌ల నుంచి 3,11,503 యూనిట్లను విక్రయించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నిచె మోడల్ బైక్ ఒక్క శాతం పురోగతి సాధించింది. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా దేశీయంగా 24.27 శాతం ప్రగతి నమోదు చేసింది. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న టీవీఎస్ మోటార్స్ దేశీయ విక్రయాల్లో 18 శాతం పెంచుకోగలిగింది. 

టీవీఎస్‌ మోటార్స్‌ 18 శాతం వృద్ధితో దూసుకెళ్లింది. 3,07,160 నుంచి 3,61,136కు విక్రయాలు పెంచుకుంది. ఇక హీరో మోటో కార్ప్ సేల్స్ ఏడు శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం హీరో విక్రయాలు 7,20,739 నుంచి 7,69,138 బైక్ లను విక్రయించింది. తొలి ఆరు నెలల్లో 42 లక్షల వాహనాలను విక్రయించినట్లు హీరో మోటో కార్ప్ ప్రకటించింది. 

ఇక కార్ల తయారీ సంస్థ టొయాటొ కిర్లోస్కర్‌ మోటార్‌ 1.43 శాతం వృద్ధి నమోదు చేసింది. విక్రయాలను 12,335 నుంచి 12,512కు పెంచుకుంది. టొయాటో కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా మాట్లాడుతూ రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం తాత్కాలికంగా వాహనాల కొనుగోలు విషయమై వినియోగదారులు వెనుకంజ వేశారన్నారు.

హ్యుందాయ్‌ అమ్మకాలు 50,028 నుంచి 47,781కి, మహింద్రా 25,414 నుంచి 21,411కు, ఫోర్డ్‌ 8,769 నుంచి 8,39కి తగ్గిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టర్ అధ్యక్షుడు రాజన్ వధేరా మాట్లాడుతూ వచ్చే పండుగల సీజన్ లో పరిస్థితి మెరుగు పడుతుందని ఆశాభావంతో ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios