మార్కెట్‌లోకి సెడాన్ కంపాక్ట్ నిస్సాన్ సన్నీ
పండుగల సీజన్‌లో లిమిటెడ్ సెడాన్ ఇంపాక్ట్ కారు మార్కెట్‌లో అడుగు పెట్టింది.
పాతకాలం నాటి ఆటోమొబైల్ సంస్థ ‘నిస్సాన్’ స్పెషల్ ఎడిషన్ సన్నీ కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. 6.2 అంగుళాల టచ్ స్క్రీన్ ‘ఏవీఎన్’, ఇన్ఫోటైన్మెంట్ విస్తరణ కోసం ఫోన్ మిర్రరింగ్ వసతి అందుబాటులో ఉంది. పండుగల సీజన్‌లో లిమిటెడ్ సెడాన్ ఇంపాక్ట్ కారు మార్కెట్‌లో అడుగు పెట్టింది.
పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో కొత్తతరం కార్ల వినియోగదారులకు రూ.8.48 లక్షలకు అందుబాటులో ఉన్నారు. సన్నీ స్పెషల్ ఎడిషన్ కారులో బ్లాక్ రూఫ్ రాఫ్, బ్లాక్ వీల్ కవర్స్, నూతన రేర్ స్పాయిలర్స్, న్యూ బాడీ డెకాల్స్ అమర్చారు. వీటికితోడు క్యాబిన్ లో అదనపు ఫీచర్లు కూడా జత కలిశాయి.
నిస్సాన్ కనెక్ట్‌కు అదనంగా సన్నీ మోడల్ కారు జియో ఫెన్సింగ్, స్పీడ్ అలర్ట్, కర్ఫ్యూ అలర్ట్, లొకేట్ మై కార్, షేర్ మై కార్ లొకేషన్, కారు సేఫ్టీ, సెక్యూరిటీ అంశాలను తెలియజేసే ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉంటాయి. ‘లీడ్ మీ టు కారు’ పేరుతో పలు కన్వీనియన్స్ ఫీచర్లు ఏర్పాటు చేశారు.
నిస్సాన్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ విభాగం డైరెక్టర్ హర్‌దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ నిస్సాన్ సన్నీ మోడల్ కారు మా ఫ్లాగ్ షిప్ ప్రొగ్రామ్‌లో భాగం, కస్టమర్లే కేంద్రంగా తయారు చేసిన సన్నీ కారు, స్మార్ట్ టెక్నాలజికల్ పరికరాలు, బెస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్స్, ఆధునాతన డ్రైవింగ్ అనుభవాన్ని అందుబాటులోకి తేనున్నది నిస్సాన్ ఇండియా.
సన్నీ ప్రత్యేక ఎడిషన్ కారు 1.5 లీటర్ల డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్ ట్రోనిక్ సీవీటీ కూడా ఉంటుంది. డీజిల్ వేరియంట్ మోడల్ కారులో 5 - స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, డోర్ లాక్, డ్రైవర్ షీట్ బెల్టు తదితర వసతులు అందుబాటులో ఉంటాయి.