పండుగల ముందు కార్ల కంపెనీల ఆఫర్ల వాన

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 14, Sep 2018, 8:18 AM IST
New Car Discounts in September 2018
Highlights

కొత్తగా కారు కొనుగోలు చేయాలని కోరుకునే వారికి వివిధ కార్ల తయారీ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. క్యాష్ బ్యాక్ మొదలు ఎక్స్చేంజ్ ఆఫర్ వరకు ధరల్లో రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి రాయితీలు వినియోగదారులకు లభిస్తున్నాయి. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన కారుకు మెరుగైన డిస్కౌంట్ ఏదో తేల్చుకోవడమే ఆలస్యం. 

మీరు కొత్త కారు కొనాలని భావిస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. మార్కెట్‌లో వివిధ సంస్థలు కల్పిస్తున్న డిస్కౌంట్లు, రాయితీలను ముందు ఎంక్వయిరీ చేయాల్సిందే. వాటిల్లో మీకు ఉపయోగపడే రాయితీలు.. ఆయా మోడల్ కార్ల గురించి తెలుసుకోవాలి. మెరుగైన డిస్కౌంట్ల గురించి పూర్తిగా అర్ధం చేసుకోవాలి.

భారతీయ ఆటోమొబైల్ సంస్థలు కార్లు తమ ఉత్పత్తుల విక్రయం కోసం ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. వివిధ కార్ల తయారీ సంస్థలు రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా నుంచి హోండా సీఆర్-వీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 500 వరకు రకరకాల కార్ల కొనుగోళ్లపై రాయితీలు ఇస్తున్నాయి. 

మారుతి సుజుకి ఎర్టిగా కొంటే రూ.75 వేల డిస్కౌంట్
త్వరలో భారతదేశ మార్కెట్‌లో ఆవిష్కరించనున్న మారుతి సుజుకి ‘న్యూ ఎర్టిగా ఎంపీవీ’ కొనే వారి కోసం డీలర్లు రూ.75 వేల రాయితీ ఇస్తున్నారు. ఇందులో క్యాష్ బెనిఫిట్లు, బై బ్యాక్ ఆఫర్లు, ఇతర బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా ఎంవీపీ మోడల్ కారులో ఏడు సీట్లు ఉన్నాయి. రెండోతరం ఎర్టిగాలో 1.5 లీటర్ల ఎస్‌హెచ్వీఎస్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇది చూడటానికి నూతన సియాజ్ మోడల్ కారు మాదిరిగా ఉంటుంది. 

హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 కొంటే రూ. లక్ష పొదుపు
మారుతి సుజుకితోపాటు త్వరలో మార్కెట్‌లో అడుగిడనున్న ‘హ్యుండాయ్ ఐ10’ మోడల్ కారు హ్యాచ్ బ్యాక్ రేస్ మాదిరిగా ఉంది. ప్రస్తుత హ్యుండాయ్ ఐ10 మోడల్ కారు కొన్న వారికి రూ. లక్ష వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. ఇందులో క్యాష్ బెనిఫిట్లు, ఎక్స్చేంజ్ బోనస్ తదితర ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. సెడాన్ సిబ్లింగ్ ఎక్స్‌సెంట్ కూడా రూ. లక్ష వరకు బెనిఫిట్లు కల్పిస్తోంది. 

మహీంద్రా ఎక్స్ యూవీ 500 కారు కొంటే రూ.1.5 లక్షల రాయితీ
మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 మోడల్ కారు దేశీయ మార్కెట్‌లోకి దూసుకెళ్తోంది. ఏడు సీట్ల క్యాబిన్, సన్ రూప్, ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తదితర వసతుల గల మోడల్. ఎస్‌యూవీ మోడల్ కారు ధర రూ.20 లక్షలు. నూతన మారుతి ఎక్స్‌యూవీ 500 మోడల్ కారు కొన్న వారికి రూ.1.5 లక్షల వరకు రాయితీ కల్పిస్తోంది. 

మారుతి సుజుకి ‘వాగన్ ఆర్’పై రూ.60 వేల రాయితీ
మారుతి సుజుకి ‘వాగన్ ఆర్’ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మోడల్. నూతన తరం మోడల్ కారును మారుతి సుజుకి వచ్చే ఏడాది మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది. దీనిపై కొందరు డీలర్లు రూ.40 వేల వరకు రాయితీనిస్తున్నారు. సంస్థ నిర్దేశించి విధానాల ప్రకారం అది రూ.60 వేల వరకు అందుబాటులో ఉంది. 

హోండా సీఆర్- వీ కారుపై రూ.1.5 లక్షల వరకు రాయితీ
జపనీస్ కారు మేకర్ ‘హోండా సీఆర్- వీ’ ప్రీమియం మోడల్ భారతదేశ మార్కెట్‌లో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై భారీ స్థాయిలో 1.5 లక్షల వరకు కంపెనీ ఆఫర్లు అందజేస్తోంది. వీటితోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్, బీమా తదితర వసతులు కల్పిస్తోంది. ఎస్‌యూవీ మార్కెట్‌లో కాంపిటెంట్ మోడల్ కారు ‘హోండా సీఆర్-వీ కానున్నది. 

హ్యుండాయ్ టుక్సాన్ కొన్నా రూ.1.5 లక్షల డిస్కౌంట్
ఐదు సీట్ల ఎస్ యూవీ మోడల్ కార్లలో హ్యుండాయ్ టుక్సాన్ ఒకటి. జీప్ కంపాస్ తరహా సంస్థలతో పోటీ పడుతూ మార్కెట్ లోకి దూసుకెళ్లనున్నది. హ్యూండాయ్ టుక్సాన్ కారు డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల ఆప్షన్లలో మంచి మంచి ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. దీన్ని కొనుగోలు చేసే వారికి అన్ని వారియంట్లపై రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్లు, బెనిఫిట్లు అందుబాటులోకి తేనున్నది. 

loader