Asianet News TeluguAsianet News Telugu

ఏబీఎస్ రీప్లేస్: 3,700 బాలెనో కార్ల రీకాల్!

బాలెనో కార్ల వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏబీఎస్ వ్యవస్థలో స్వల్ప మార్పులు చేయాల్సి ఉన్నదని మారుతి సుజుకి తెలిపింది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు విక్రయించిన 3,757 మోడల్ కార్లను రీ కాల్ చేస్తున్నట్లు సంబంధిత కస్లమర్లకు నోటీసులు పంపించింది. 

MSI starts service campaign for 3,757 units of Baleno to inspect ABS software
Author
Hyderabad, First Published Feb 25, 2019, 11:17 AM IST

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ సర్వీస్ క్యాంపెన్‌లో భాగంగా 3,757 యూనిట్ల ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ బాలెనో కార్లను రీ కాల్ చేస్తోంది. ఈ కార్లలో గల బ్రేకింగ్ సిస్టమ్‌లోని కీలక పార్ట్ ఏబీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు తెలిపింది.

గతేడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఉత్పత్తి చేసిన ఈ కార్లలో ఏబీఎస్‌లో సాంకేతిక సమస్యలు గుర్తించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఆయా కస్టమర్లకు సమాచారం కూడా ఇచ్చింది.

అత్యవసర సమయంలో బ్రేకింగ్‌ను కంట్రోల్ చేయడానికి వినియోగించే  ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ఈసీయూ)లో ఉన్న హైడ్రాలిక్ డివైజ్‌తో యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)కి నేరుగా సంబంధం ఉంటుంది. 

ఇది రీకాల్ కాదని, కేవలం సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించి ఇవ్వడం జరుగుతున్నదని, దీంట్లో భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనలేదని స్పష్టంచేసింది. అంతర్జాతీయ వివిధ ఆటోమొబైల్ సంస్థలు అంతర్జాతీయంగా అందిస్తున్న సర్వీస్ క్యాంపెయిన్‌లో భాగంగానే తాము క్యాంపెయిన్ చేపట్టామని పేర్కొంది.

వినియోగదారులకు ఇన్ కన్వీనెన్స్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మారుతి సుజుకి తెలిపింది. ఏబీఎస్ సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారులు తమ సమీప డీలర్‌ను సంప్రదించాలని సూచించింది. సాఫ్ట్‌వేర్ రీ ప్లేస్‌మెంట్ కొన్ని నిమిషాల్లో పూర్తవుతుందని తెలిపింది. 

బీఎస్ -4 ప్రమాణాలకు అనుగుణంగా 2019 జనవరి బాలెనోలో మైనర్ ఫేస్ లిఫ్ట్ మార్పులు చేయాల్సి ఉన్నది. 3డీ ప్యాట్రన్‌తో ఫ్రంట్ గ్రిల్లెను స్వల్పంగా సవరించారు. న్యూ ఫ్రంట్ బంపర్‌ను అమర్చారు. డెల్టా వేరియంట్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, న్యూ అల్లాయ్ వీల్స్, టెయిల్ లైట్స్ కలిగి ఉన్న మారుతి బాలెనో మోడల్ కార్లు మాగ్మా, ఫోనిక్స్ రెడ్ రంగుల్లో వినియోగదారులకు లభిస్తాయి. 

మారుతి సుజుకి బాలెనో కారు క్యాబిన్ న్యూ ఫాబ్రిక్, నూతన తరం స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమం, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

మారుతి సుజుకి బాలెనో 2019 ఫేస్ లిఫ్ట్ ధర రూ.5.45 లక్షల నుంచి రూ.8.77 లక్షలు పలుకుతోంది. హ్యుండాయ్ ఐ20, వోక్స్ వ్యాగన్ పోలో, త్వరలో టాటా మోటార్స్ ఆవిష్కరించనున్న ఆల్ట్రోజ్ మోడల్ కారును మార్కెట్లో బాలెనో ఫేస్ బుక్ ఢీ కొట్టనున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios