Asianet News Telugu

హెక్టార్ యమస్మార్ట్ గురూ! హ్యుండాయ్, నిసాన్, జిప్, మహీంద్రాలకు సవాలే.. నోడౌట్!!


బ్రిటన్ ఆటో మేజర్ ‘ఎంజీ’ మోటార్స్ అత్యాధునిక టెక్నాలజికల్ ఫీచర్లతో భారత విపణిలోకి హెక్టార్ అనే ఎస్ యూవీ మోడల్ కారును ఆవిష్కరించింది. ఇందులో బోల్డ్ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.. ఒక్కసారి పరిశీలిద్దాం..

MG Motor launches SUV Hector in India
Author
New Delhi, First Published Jun 28, 2019, 10:38 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: బ్రిటన్ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ మోటార్స్ సరికొత్త కారు హెక్టర్ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.12.18లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ.16.88 లక్షలుగా నిర్ణయించారు. హెక్టర్ మోడల్ కారు నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. 

ఎంజీ హెక్టార్ కారు స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ఫ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కంపెనీ భారత్లో మొత్తం 120 కేంద్రాలను ఏర్పాటు చేసి తన కార్యకలాపాలను ప్రారంభించింది. కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వీటి సంఖ్య భవిష్యత్ లో 250కు చేరవచ్చు. 

ఆలస్యంగానైనా తాజాగా అధునాతన ఫీచర్లతో మోరిస్ గ్యారెజెస్ కంపెనీ హెక్టర్ మోడల్. కారును విపణిలోకి తెచ్చింది.  ఈ టెక్ కారు రూపకల్పన కోసం ఎంజీ మోటార్స్ టెక్నాలజీ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, అడోబ్, ఎస్ఏపీ, సిస్కో, గానా, టామ్టామ్, అన్లిమిటెడ్లతో ఒప్పందం కుదుర్చుకుంది కంపెనీ. 

హ్యుండాయ్ క్రెటా, నిస్సాన్ కిక్స్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్యూవీ 500, హ్యుండాయ్ టక్సన్ మోడల్ కార్లతో ఎంజీ హెక్టార్ కారు పోటీ పడనున్నది. టెక్నాలజీ అందుబాటులో అరచేతిలోనే ప్రపంచం. అంటే అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ కారును మన స్మార్ట్ ఫోన్‌తోనే అనుసంధానం చేసుకోవచ్చు. 

ఈ కారులోనే ఈ-మెయిల్, ఇతర ఫైల్స్ చూసుకోవచ్చు. ‘లొకేట్ మై కార్’ ఆప్షన్తో మనం ఎక్కడ పార్కింగ్ చేసిందీ తెలుసుకోవచ్చు. చోరీకి గురైనా  తెలిసిపోతుంది. 360 డిగ్రీల కోణంలో చూపఏ కెమెరా అదనపు ఫీచర్. డ్రైవర్ అనలిటికల్ డేటాతో కారు డ్రైవర్‌పై భారం తగ్గిస్తూ డ్రైవింగ్ స్మార్ట్‌గా కొనసాగేందుకు దోహదపడుతుంది. 
ఐస్మార్ట్ యాప్ తో టైర్ ప్రెషర్, డోర్లు లాక్/అన్ లాక్.. ఎయిర్ కండీషనర్ పరిస్థితి తదితర వివరాలు తెరపై చూసుకోవచ్చు. 

ఇదిలా ఉంటే ఎస్యూవీ విభాగంలో ఇది అతి పెద్ద కారు ఇది. 4655 ఎంఎం పొడవు, 1835ఎంఎం వెడల్పు, 1760 ఎంఎం ఎత్తు ఉంది. ఐదు సీట్లలో లభిస్తోంది. 1956సీసీ సామర్థ్యం, 1760బీహెచ్పీ శక్తి, 16వీ మల్టీజెట్ ఇంజిన్.. పెట్రోల్/డీజిల్ వేరియంట్లలో 4సిలిండర్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది.

ఎంజీ హెక్టర్ కారులో 10.4 అల్ట్రా లార్జ్, ఫుల్ హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. హై-ఎండ్ కార్లలో సైతం ఇంత పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండటం తక్కువ. చేతి కొనవేళ్లతో తాకి దీనికి కమాండ్ ఇవ్వొచ్చు లేదా వాయిస్ ఆదేశాల ద్వారా కూడా ఇది పని చేస్తుంది. ‘

హలో ఎంజీ`అనగానే సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఓపెన్ సన్ రూఫ్, క్లోజ్ విండో, ఆన్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్, ఆఫ్ నావిగేషన్.. ఇలా వందరకాల కమాండ్స్‌కు అనుగుణంగా పని చేస్తుంది. ఇండియన్ ఇంగ్లిష్, ఫారిన్ ఇంగ్లిష్.. ఏ యాసలో మాట్లాడినా స్పందిస్తుంది. నెట్ కనెక్షన్ బాగా లేకున్నా ఇది పని చేస్తుంది. 

5జీ సేవలు సైతం వినియోగించుకునేలా ఇందులో మినీ నుంచి నానో వరకు నాలుగు సిమ్లు వేసుకోవచ్చు. దీని సాయంతో ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఇంటర్నెట్తో అనుసంధానం కావొచ్చు. దీనికోసం సిస్కో, ఎయిర్టెల్ సహకారం తీసుకుంటున్నారు.  ఈ సాఫ్ట్ వేర్ ప్రఖ్యాత చైనా కంపెనీ నాన్స్ తయారు చేసింది.  ఇందులో ఇన్ బిల్ట్‌గా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉందని ఎంజీ కంపెనీ చెబుతోంది.

ఇండియాలో తొలిసారి ఆటోమొబైల్ ప్లేయర్లో ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) టెక్నాలజీ అమర్చిన తొలి కారు ఇదేనంటోంది ఎంజీ. దీని ద్వారా రియల్టైం సాఫ్ట్వేర్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్, అప్లికేషన్ల అప్డేట్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ నుంచి అప్ డేట్ చేసుకోవచ్చు. సాఫ్ట్ వేర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

‘ఈ-కాల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్’ద్వారా ఒక ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేస్తే చాలు.. యాక్సిడెంట్, ఇతర అత్యవసర సమయాల్లో ‘పల్స్ హబ్’అనే కస్టమర్ కేర్‌కు ఆటోమేటిగ్గా ఫోన్ వెళ్లిపోతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నావిగేషన్ సాఫ్ట్వేర్ అందిస్తున్న కంపెనీ ‘టామ్టామ్’ 3డీ నావిగేషన్, ఐక్యూ మ్యాప్‌ల ద్వారా వీళ్లు సేవలందిస్తారు. ఎంజీ హెక్టర్ కూడా ప్రత్యేకంగా ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తోంది. దీంతోపాటు పాటలు వినడానికి ‘గానా’యాప్, కచ్చితమైన వాతావరణ వివరాల కోసం ‘ఆక్యూ వెదర్’యాప్ ఇందులో బిల్ట్ఇన్ గా చేర్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios