Asianet News TeluguAsianet News Telugu

దేశవ్యాప్త 'సర్వీస్ క్యాంప్' ను ప్రకటించిన ఎంజి మోటార్ ఇండియా.. జూలై 18 వరకు 25% వరకూ డిస్కౌంట్..

ఉచిత 25 పాయింట్ల వెహికల్ హెల్త్ చెకప్ అండ్ కాంప్లిమెంటరీ కార్ వాష్, ఎసి సర్వీస్ పై 25% వరకూ డిస్కౌంట్ ఇంకా  వాల్యూ-ఆధారిత సేవలపై 20% వరకూ తగ్గింపు. ఈ సర్వీస్ క్యాంప్ జూలై 18 వరకు కొనసాగనుంది. 
 

MG Motor India has announced the annual Service Camp for its customers-sak
Author
First Published Jul 6, 2023, 2:11 PM IST

హైదరాబాద్: 99-సంవత్సరాల చరిత్ర గలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజి మోటార్ ఇండియా కస్టమర్ల కోసం వార్షిక సర్వీస్ క్యాంపు నిర్వహణను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిర్వహించబడే ఈ సర్వీస్ క్యాంప్, ఇండియాలోని అధీకృత ఎంజి సర్వీస్ కేంద్రాలన్నింటిలోనూ జూలై 18 వరకు కొనసాగుతుంది.  

సర్వీస్ క్యాంప్ సందర్భంగా, ఎంజి కస్టమర్లు ఈ క్రింది ఆఫర్లను పొందవచ్చు: 
●    ఉచిత 25 పాయింట్ల వెహికల్ హెల్త్ చెకప్
●    ఉచిత కార్ వాష్
●    ఉచిత బ్యాటరీ హెల్త్ చెకప్ 
●    ఎసి సర్వీస్ పై 25% వరకూ డిస్కౌంట్ 
●    వాల్యూ-ఆధారిత సేవలపై 20% వరకూ తగ్గింపు
●    ఇంజన్ ఆయిల్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ 
●    టైర్ మార్పుపై స్పెషల్ ఆఫర్  

ఈ ప్రకటనపై  ఎంజి మోటార్ ఇండియా డైరెక్టర్, ఆఫ్టర్ సేల్స్ రాజేష్ మల్హోత్రా మాట్లాడుతూ “ఎంజి మోటార్ ఇండియాలో మేము చేసే ప్రతి పనిలోనూ ఎంజి ఓనర్లను కేంద్ర స్థానములో ఉంచుతాము. మా శిక్షణ పొందిన నిపుణులు క్యాంప్ సమయంలో అందించే సేవలు మా కస్టమర్లకు పూర్తి మనశ్శాంతితో అవాంతరాలు లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయని మేము నమ్ముతున్నాము." అని అన్నారు. 

తమ కస్టమర్లకు సర్వశ్రేష్టమైన అమ్మకాలను ఇంకా విక్రయానంతర అనుభవాన్ని అందించడానికి ఎంజి కట్టుబడి ఉంది. జె.డి. పవర్ 2021లో ఇంకా 2022 ఇండియా అమ్మకాల సంతృప్తి సర్వే (ఎస్.ఎస్.ఐ)లో నంబర్ వన్ (1) ర్యాంకును అలాగే   ఇండియా కస్టమర్ సర్వీస్ ఇండెక్స్ అధ్యయనము (సిఎస్ఐ) లో నంబర్ వన్ (1) ర్యాంకును పొందింది అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios