Asianet News TeluguAsianet News Telugu

8 నెలల్లోనే రికార్డు.. 50 వేలు దాటిన హెక్టార్ బుకింగ్స్

ఎంజీ మోటార్స్ భారతదేశం అంతటా 200కి పైగా కేంద్రాల్లో డీలర్ షిప్ లు కలిగి ఉంది. వచ్చేనెలాఖరు నాటికి 250 కేంద్రాలకు విస్తరించాలని ఎంజీ మోటార్స్ లక్ష్యంగా పెట్టుకున్నది. 2020 దీపావళి నాటికి తమ గ్లోస్టర్ మోడల్ కారు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది ఎంజీ మోటార్స్. 
 

MG Hector Bookings Cross 50,000 Mark in India; 20,000 Units of SUV Sold Till Now
Author
New Delhi, First Published Feb 23, 2020, 2:33 PM IST

న్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ ఇండియా విపణిలో ఆవిష్కరించిన సీ-ఎస్‌యూవీ మోడల్ కారు ‘హెక్టార్’ బుకింగ్స్ రికార్డు నెలకొల్పాయి. ఇప్పటి వరకు 50 వేల బుకింగ్స్ నమోదు చేసుకున్నది. కాగా గతేడాది విపణిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వేల కార్లను విక్రయించినట్లు ఎంజీ మోటార్స్ తెలిపింది. 

ఎంజీ మోటార్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా స్పందిస్తూ.. భారత మార్కెట్‌లో హెక్టార్ మోడల్ కారుకు బాగానే ప్రతిస్పందన లభిస్తోంది. కేవలం ఎనిమిది నెలల్లోపే 50 వేలకుపైగా బుకింగ్స్ నమోదు చేసుకుంది.

Also read:ఆధార్‌ నంబర్ ఉంటే చాలు. పది నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ

ఈ నేపథ్యంలో సదరు హెక్టార్ మోడల్ కార్ల విక్రయాన్ని వేగవంతం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో నూతన ఔట్ లెట్లను ప్రారంభిస్తాం. ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాం. 6-సీటర్ ఫ్యామిలీ వర్షన్ కారును వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో విపణిలో ఆవిష్కరిస్తాం. భారతదేశ విపణిలో హెక్టార్ బ్రాండ్ మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం’ అని చెప్పారు. 

ఇప్పటికే ఎంజీ మోటార్స్ భారతదేశం అంతటా 200కి పైగా కేంద్రాల్లో డీలర్ షిప్ లు కలిగి ఉంది. వచ్చేనెలాఖరు నాటికి 250 కేంద్రాలకు విస్తరించాలని ఎంజీ మోటార్స్ లక్ష్యంగా పెట్టుకున్నది. 2020 దీపావళి నాటికి తమ గ్లోస్టర్ మోడల్ కారు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది ఎంజీ మోటార్స్. 

ఎంజీ హెక్టార్ 11 కాంబినేషన్లతో నాలుగు వేరియంట్లలో లభ్యం కానున్నది. స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ వేరియంట్లలో లభ్యం కానున్న ఎంజీ హెక్టార్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెల్రోల్, పెట్రోల్ హైబ్రీడ్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఎంజీ హెక్టార్ లభ్యం కానుంది. డీజిల్, పెట్రోల్ వేరియంట్ కార్లు పరస్పరం మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వసతి కలిగి ఉంటాయి.

ఎంజీ హెక్టార్ మోడల్ కారులో 25 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వాటిల్లో ఈస్మార్ట్ ఫీచరింగ్ తోపాటు 10.4 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఆప్షన్లు దీని సొంతం. వీటితోపాటు ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్, పనోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ ఓఆర్వీఎంస్ తదితర ఫీచర్లు జత కలిశాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios