జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్... భారత్ లోకి అడుగుపెట్టిన 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా... బెంజ్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ కార్లు కొనాలనుకునే కస్టమర్లకు ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుంది. ఎస్ యూవీ రేంజ్ వాహనాలన్నింటిపై అదనంగా 25శాతం ప్రయోజనాలు కల్పించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ క్లాస్, జీఎల్ఈ క్లాస్, టాప్ రేంజింగ్ జీఎల్ఎస్ ఎస్ యూవీ వాహనాలు, జీఎల్ఏ ఎంట్రీ లెవల్ క్లాస్ వాహనాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ మోడల్స్ వాహనాలపై వడ్డీ రేట్లు, భీమా, సేవా ప్యాకేజీలు, పొడిగించిన వారంటీ , కారు యాక్ససరీస్ వంటి వాటిపై  25 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

 ఈ ఏడాది మొదట్లొ మెర్సిడెస్ బెంజ్ 2019 సమ్మర్ క్యాంప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గత ఐదేళ్లలో తమ వద్ద కార్లు కొనుగోలు చేసిన కస్టమర్లందరికీ ఓ ఆఫర్ ప్రకటించారు. కార్లలోని కొన్ని పార్ట్స్ ని రీబేట్ చేసుకోవాలనుకునే వారికి 25శాతం డిస్కౌంట్ అందించింది. ఈ విషయాన్ని తాజాగా కంపెనీ నిర్వాహకులు మరోసారి గుర్తు చేశారు. ఈ ఏడాది 7000 మంది కస్టమర్లను చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగానే ఈ ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్లు చెప్పింది.