Asianet News TeluguAsianet News Telugu

సేఫ్టీలో విటారా బ్రెజా బెస్ట్.. రెనో ‘లాజీ’ లాస్ట్

ప్రయాణికుల భద్రత విషయంలో మారుతి సుజుకి సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారుకు గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎన్ క్యాప్ నాలుగు నక్షత్రాల రేటింగ్ ఇచ్చింది. ఇక రెనో ఎంపీవీ మోడల్ ‘లాజీ’ కారుకు సున్నా రేటింగ్ ఇచ్చింది. 

Maruti Suzuki Vitara Brezza Crash Tested By Global NCAP; Here's Its Score
Author
New Delhi, First Published Sep 28, 2018, 10:28 AM IST

 

న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సబ్ కంపాక్ట్ మోడల్ ఎస్ యూవీ కారు విటారా బ్రెజా నాలుగు స్టార్లు పొందింది. ఈ విషయమై గ్లోబల్ వెహికిల్స్ సేఫ్టీ సంస్థ ‘ఎన్ క్యాప్’ ఆయా కార్లకు ప్రమాద పరీక్షలు నిర్వహించిన అనంతరం వాటికి రేటింగ్ ఇచ్చింది. వ్యక్తుల భద్రత విషయంలో మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన విటారా బ్రెజాకు ఎన్ క్యాప్ నాలుగు నక్షత్రాల రేటింగ్‌, రెనో ఎమ్‌పీవీ లాజీకి సున్నా రేటింగ్‌ను ఇచ్చింది.

మారుతి సుజుకి విటారా బ్రెజా గంటకు 64 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. భారతదేశంలోని మారుతి సుజుకి మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ లో రూపుదిద్దుకున్న విటారా బ్రెజా కేవలం డీజిల్ వేరియంట్ విత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వినియోగదారులకు లభిస్తోంది. మారుతి సుజుకి విటారా బ్రెజా కారు స్ట్రక్చర్ లోనూ సుస్థిరంగా సాగుతోంది.

ఈ పరీక్షలను బ్రెజా ప్రామాణిక వేరియంట్‌, లాజీ ప్రామాణిక వేరియంట్‌లపై నిర్వహించారు. ఈ వేరియంట్లలో బ్రెజాకు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండగా.. లాజీకి అసలు ఎయిర్‌బ్యాగ్‌లు లేవు. అయితే దేశంలో తాము విక్రయిస్తున్న అన్ని మోడళ్లూ ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) నిబంధనల కంటే మెరుగ్గానే ఉన్నాయని రెనో ఇండియా పేర్కొంది.

రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ఐసోఫిక్స్‌ యాంకరేజెస్‌ కలిగి ఉండటంతో మారుతి సుజుకి విటారా బ్రెజా మోడల్ కారుకు వ్యక్తుల భద్రత విషయంలో నాలుగు స్టార్లు, పిల్లల భద్రత విషయంలో రెండు స్టార్లు లభించాయి. ‘పెద్దల భద్రత విషయంలో బ్రెజా బాగుంది. పిల్లల విషయానికొస్తే మాత్రం మూడేళ్ల పిల్లల విషయంలో భద్రత బాగున్నా.. 18 నెలల వయసున్న వారి విషయంలో 2 స్టార్లు మాత్రమే వచ్చాయ’ని గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ పేర్కొంది. మారుతి సుజుకి విటారా బ్రిజాలో డ్రైవర్‌కు, ప్రయాణికుల తలకు రక్షణ వసతులు ఉన్నాయి. మారుతి సుజుకి విటారా బ్రెజా మోడల్ తర్వాత భారతదేశంలో ఉత్పత్తవుతున్న నెక్సాన్ తోపాటు టయోటా ఎటియోస్, టాటా జెస్ట్, వోక్స్ వ్యాగన్ పోలో మోడల్ కారు నాలుగు నక్షత్రాల రేటింగ్ పొందాయి. 

ఇక రెనో లాజీకి పెద్దల భద్రత విషయంలో సున్నా రేటింగ్‌, పిల్లల భద్రత విషయంలో రెండు స్టార్ల రేటింగ్‌ దక్కిందని తెలిపింది. ఎయిర్‌బ్యాగ్‌లు లేకపోవడం కూడా సున్నా రేటింగ్‌ రావడానికి ఒక కారణమని వివరించింది. తన భారత ఉత్పత్తులన్నిటిలోనూ ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయడానికి రెనోకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించింది. గ్లోబల్‌ ఎన్‌సిఎపి నిర్వహించిన పరీక్షల్లో వేగం ఎఆర్‌ఎఐతోపాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాల రెగ్యులేటరీ అథారిటీలు నిర్ణయించిన దానికన్నా ఎక్కువగా ఉందని రోనో ఇండియా తెలిపింది. గంటకు 64 కిలో మీటర్ల వేగంతో గ్లోబల్‌ ఎన్‌సిఎపి క్రాష్‌ టెస్ట్‌ నిర్వహిస్తుందని, భారత్‌లోని రెగ్యులేటరీ సంస్థలు నిర్ణయించిన వేగం మాత్రం గంటకు 48 కిలో మీటర్లే ఉంటుందని పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios