Asianet News TeluguAsianet News Telugu

తగ్గిన ఎగుమతులు: స్వల్పంగా ‘మారుతి’ సేల్స్ నెగెటివ్

తగ్గిన ఎగుమతులు: స్వల్పంగా ‘మారుతి’ సేల్స్ నెగెటివ్ 

Maruti Suzuki September sales down 0.5% at 162,290 units
Author
New Delhi, First Published Oct 1, 2018, 1:30 PM IST

న్యూఢిల్లీ: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో 1,63,071 కార్లు విక్రయించగా, ఈ ఏడాది 1,62,290 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ప్రత్యేకించి విదేశాలకు ఎగుమతుల్లో పతనమే విక్రయాలు తగ్గిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. ఇక ప్రయాణికుల కార్ల విక్రయాలు 1.4 శాతం తగ్గాయి. గతేడాది 1,16,886 కార్లు అమ్ముడు పోతే ఈ ఏడాది 1,15,228 కార్లు అమ్ముడయ్యాయి. 

దేశీయ కార్లలో స్వల్ప పురోగతి
దేశీయ ప్రయాణికుల కార్ల విక్రయాల్లో మాత్రం 0.7 శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది 1,50,521 కార్లు విక్రయిస్తే ఈ ఏడాది 1,51,512 యూనిట్లను మారుతి సుజుకి అమ్మింది. స్థూలంగా ఎల్సీవీతో కలిపి మొత్తం కార్ల విక్రయంలో 1.4 శాతం పెరుగుదల నమోదైంది. ఎగుమతుల్లో 25.1 శాతం పతనం నమోదై 11,671 కార్ల నుంచి 8,740 యూనిట్లకు పడిపోయింది. అర్ధ సంవత్సర విక్రయాల్లో మాత్రం 10 శాతం పురోగతి నమోదైంది. గతేడాది 8,86,689 కార్లు విక్రయించగా, ఈ ఏడాది 9,75,327 యూనిట్లు అమ్ముడు పోయాయి. 

అశోక్ లేలాండ్ విక్రయాల్లో 26 శాతం పురోగతి
వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ విక్రయాల్లో 26 శాతం ప్రగతి నమోదైంది. గతేడాది 15,371 వాహనాలు అమ్మగా, ఈ ఏడాది 19,373 వాహనాలు విక్రయం అయ్యాయి. ఎంహెచ్సీవీ విక్రయాలు 11,805 యూనిట్ల నుంచి 14,,232 యూనిట్లకు చేరాయి. ఎల్సీవీ వాహనాల విక్రయాల్లో 44 శాతం పురోగతి నమోదై.. 3,566 వాహనాల నుంచి 5141 యూనిట్లు అమ్ముడు పోయాయి.  

బజాజ్ సేల్స్ లో 17% రైజ్
వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో గత నెల విక్రయాల్లో 17 శాతం వ్రుద్ధి నమోదు చేసింది. గతేడాది సెప్టెంబర్ నెలలో 4,28,752 యూనిట్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది5,02,009 వాహనాలు విక్రయించింది. దేశీయ విక్రయాల్లో 11 శాతం వ్రుద్దిరేటు నమోదైంది. గతేడాది 2,81,779 వాహనాలను విక్రయిస్తే.. ఈ ఏడాది 3,11,503 యూనిట్లు అమ్ముడు పోయాయి. మోటార్ సైకిళ్ల విక్రయాల్లో దేశీయంగా 10 శాతం పురోగతి రికార్డై 2,47,418 యూనిట్ల నుంచి 2,73,029 వాహనాలు అమ్ముడు పోయాయి. ఎగుమతులు 30 శాతం పెరిగి 1,46,973 బైక్ లు అమ్ముడు పోగా, 1,90,506 మోటార్ సైకిళ్లు విక్రయమయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios