వినియోగదారుల నుంచి మారుతి ‘ఎల్సీవీ క్యారీ’ 640 కార్ల రీకాల్

First Published 4, Oct 2018, 2:24 PM IST
Maruti recalls 640 units of Super Carry LCV to fix defect in fuel pump supply
Highlights

మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) తాను తయారు చేసిన సూపర్ క్యారీ ఎల్సీవీ వెహికల్స్‌లో 640 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్యూయల్ పంపులో లోపాలను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) తాను తయారు చేసిన లైట్ కమర్షియల్ వెహికిల్ (ఎల్సీవీ) సూపర్ కార్యీ ని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్‌లో విక్రయించిన సూపర్ క్యారీ ఎల్సీవీ వాహనం ఫ్యూయల్ పంప్ సరఫరాలో ఏర్పడిన లోపాన్ని తొలగించడం కోసం రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. 

ఈ ఏడాది జనవరి 20వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు తయారు చేసిన సూపర్ క్యారీ యూనిట్లన్నీ రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. బుధవారం నుంచి వాహనాల కొనుగోలుదారులంతా తమ వాహనాల రీకాల్ ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా మారుతి సుజుకి ఇండియా కోరింది. వాటిని మారుతి సుజుకి ఇండియా డీలర్ల పర్యవేక్షణలో తనిఖీ చేసి ఉచితంగా లోపాలను సరిదిద్ది తిరిగి సంబంధిత వినియోగదారులకు అందజేస్తారని ేర్కొన్నది. 

గురుగ్రామ్ ఉత్పాదక యూనిట్ నుంచి మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) సూపర్ క్యారీ లైట్ వెహికల్ (ఎల్సీవీ)ని గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 వేల వాహనాలను విక్రయించింది. తద్వారా నూతన కమర్షియల్ సేల్స్ చానెల్‌ను స్థాపించింది. దేశీయ మార్కెట్‌తోపాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, నేపాల్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి చేసింది మారుతి సుజుకి ఇండియా. ఈ వాహనంలో 793 సీసీ సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్ చేర్చారు.

loader