Asianet News TeluguAsianet News Telugu

త్వరలో విపణిలోకి మారుతీ మరో చిన్నకారు ‘ఎస్ ప్రెస్సో’

మారుతి సుజుకి తన లాభాలను పెంచుకునేందుకు ఫస్ట్ టైం యూజర్ల కోసం సరికొత్త మోడల్ కారు మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎస్ ప్రెస్సో పేరుతో రూపుదిద్దుకున్న ఈ కారు యువతను బాగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Maruti has a secret for first-time car buyer
Author
Mumbai, First Published Jun 20, 2019, 11:40 AM IST

ముంబై: అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గత ఏడు నెలలుగా అమ్మకాల్లో వరుస నష్టాలను చూస్తోంది. తిరిగి సంస్థను లాభాల గాడిలో పడేందుకు మారుతి ప్రణాళికలు రచిస్తోంది. తొలిసారి కార్లను కొనుగోలు (ఫస్ట్‌ టైం యూజర్స్‌) చేసేవారిని దృష్టిలో పెట్టుకొని, అమ్మకాలు పుంజుకొనేలా ఈ పండగ సీజన్‌లో సరికొత్త క్రాస్‌ఓవర్‌ చిన్న కారు  మారుతీ ‘ఎస్‌-ప్రెస్సో’ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

మారుతీ సుజుకీ జపాన్‌ సహకారంతో డిజైన్‌, ఇంజినీరింగ్‌ పరంగా పూర్తిగా భారత పరిశోధన, అభివృద్ధి (ఆర్‌&డీ) యూనిట్‌ నేతృత్వంలో రూపుదిద్దుకున్న చిన్న కార్ల జాబితాలో విటారా బ్రెజ్జా తర్వాత ఎస్‌-ప్రెస్సో మోడల్ కారు కావడం గమనార్హం. పూర్తిగా దేశీయంగా వాహనాలను ఉత్పత్తి చేస్తూ రాయల్టీ మీద పెట్టే ఖర్చులను సైతం తగ్గించుకునేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది.

బోల్డ్‌ క్రాస్‌ఓవర్‌ ఎస్‌యూవీ డిజైన్‌, ఎంట్రీ లెవెల్‌ సెగ్మెంట్‌లో హై గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో రెనో క్విడ్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.  ‘వై1కే’ కోడ్ నేమ్‌తో మారుతి సుజుకి చిన్న కారు రూపుదిద్దుకుంటున్నది. 

ఆటోమేటిక్‌, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఏబీఎస్‌ వ్యవస్థ, స్టాండర్డ్‌ డ్యుయల్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, ఒక లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, టచ్‌ స్క్రీన్‌ , రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ తదితర వసతులతో ఈ చిన్న కారును ఆకర్షణీయ డిజైన్‌తో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టచ్ స్క్రీన్ రేర్ పార్కింగ్ సెన్సర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ కలర్స్‌లో ఈ మోడల్ కారు విపణిలోకి అందుబాటులోకి రానున్నది.

మారుతి సుజుకి ‘ఎస్ ప్రెస్సో’ మోడల్‌ పూర్తి వివరాలు వెల్లడించకున్నా సమీప భవిష్యత్‌లో మార్కెట్లో ఈ మోడల్‌ సరికొత్త ట్రెండ్‌ను సృష్టంచడం ఖాయం అని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్.సి.భార్గవ ఓ వార్తా సంస్థకు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios