Asianet News TeluguAsianet News Telugu

ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్‌లో మారుతి హవా!

ఈనాడు కార్లు కలిగి ఉండటం ఒక ఫ్యాషన్. వ్యక్తిగత, ప్రయాణ వాహన కార్లు ఉన్నాయి. అందులో గతనెల ప్రయాణ వాహనాల విక్రయంలో మారుతి సుజుకి హవా సాగింది. టాప్ టెన్ కార్ల విక్రయాల్లో తొలి ఆరు ర్యాంకులు మారుతి సుజుకికి చెందిన మోడల్ కార్లవే కావడం హైలెట్.

Maruti dominates PV sales in August with 6 models in top ten list
Author
Mumbai, First Published Sep 20, 2018, 8:41 AM IST

మనదేశంలోని కార్ల తయారీ సంస్థల్లో అగ్రశ్రేణి సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) ఒకటి. వ్యక్తిగత, ప్రయాణ వాహనాల తయారీలోనే కాదు విక్రయాల్లోనూ టాప్ గానే నిలిచింది. గత నెలలో జరిగిన కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి ప్రయాణికుల వాహనాల విభాగంలో ఆరు మోడల్స్ ముందు వరుసలో నిలిచాయి. 

మారుతి సుజుకి ఇండియా ఎంట్రీ లెవల్ కారు ‘ఆల్టో’ విక్రయాల్లో మొదటి స్థానంలో ఉన్నదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది. గత నెలలో మారుతి ఆల్టో మోడల్ కార్లు 22,237 అమ్ముడు పోయాయని పేర్కొంది. గతేడాది ఇదే నెలలో ఆల్టో మోడల్ కార్లు 21,521 యూనిట్లు అమ్ముడుపోయి రెండో స్థానంలో నిలిచింది. 

గత నెలలో మారుతి సుజుకి ఇండియా కంపాక్ట్ సెడాన్ డిజైర్ మోడల్ కార్లు 21,990 యూనిట్లు విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. గతేడాది 30,934 యూనిట్ల విక్రయాలతో టాప్‌లో ఉంది. మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ ‘స్విఫ్ట్’ మోడల్ కార్లు 19,115 యూనిట్లు విక్రయం అయ్యాయి. గతేడాది ఆగస్టులో 12,631 కార్లు అమ్ముడు కావడంతోపాటు ఆరో స్థానంలో నిలిచింది ‘స్విఫ్ట్’.

మారుతి బాలెనో మోడల్ కార్లు 17,713 యూనిట్ల విక్రయంతో నాలుగో స్థానంలో ఉండగా, గతేడాది 17,190 కార్లు అమ్ముడు పోయినా ఈసారి మాత్రం వెనుకబడే ఉంది. మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు వాగన్ ఆర్ 13,658 కార్ల విక్రయంతో ఐదవ స్థానంలో ఉంది. గతేడాది 13,907 యూినట్లు అమ్ముడయ్యాయి. 

ఇక ఎస్‌యూవీ మోడల్ ‘విటారా బ్రెజ్జా’ విక్రయాలు 13,721 యూనిట్లతో ఆరో స్థానంలో ఉంది. కానీ గతేడాది విక్రయాల్లో విటారా బ్రెజ్జా నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. మారుతి సుజుకి ప్రత్యర్థి హ్యుండాయ్ కంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ ‘గ్రాండ్ ఐ10’ మోడల్ 11,489 కార్ల యూనిట్లతో ఏడో స్థానంలో నిలిచింది. 

హ్యుండాయ్ కారు మరో హ్యాచ్ బ్యాక్ ‘ఎలైట్ ఐ20’ 11,475 యూనిట్ల విక్రయంతో ఎనిమిదో ర్యాంక్ దక్కించుకున్నది. మూడో హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘క్రెటా’ విక్రయాలు 10,394 యూనిట్లు అమ్ముడు పోగా తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నది. హోండా కంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’ 9,644 యూనిట్ల విక్రయంతో 10వ ర్యాంకుకు పరిమితమైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios