న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎస్‌యూవీ థార్‌ 700 కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో దీని ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. చివరి దశలో భాగంగా లిమిటెడ్‌ ఎడిషన్‌లో భాగంగా 700 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. 

మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సంతకంతో దీన్ని ఆవిష్కరించారు. తొలుత దీన్ని ఏప్రిల్ నెలలో పదర్శించారు. స్టాండర్డ్ మహీంద్రా థార్ సీఆర్డీఈ 4డబ్ల్యూడీ మోడల్ జీప్‪తో పోలిస్తే రూ.50 వేలు ఎక్కువ. 

మహీంద్రా మర్రాజోలో మాదిరిగా ఆక్వా మారిన్‌తోపాటు నెపొలీ బ్లాక్ కలర్స్‌తో ఎక్స్‌టీరియర్ పెయింట్ వేశారు. మహీంద్రా థార్ జీప్ మోడల్‌లో ప్రీవియస్ జనరేషన్ స్కార్పియో, మార్క్స్‌మాన్ మాదిరిగా ఫైవ్ స్పోక్, 15 అంగుళాల వీల్స్‌ చేర్చారు. 

థార్ సిగ్నేచర్ ఎడిషన్ తన బాయ్నెట్ లిడ్, సిల్వర్ ఫినిష్‌తో ఫ్రంట్ బంపర్‌గా రూపొందించారు. అదనంగా థార్ 700 రైట్ ఫెండర్ మోడల్ జీప్‌పై మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతకంతో కూడిన లెథరెట్టె కవర్లను సీట్లను కవర్ చేశారు.

మహీంద్రా థార్ 700 మోడల్ జీపులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తోపాటు 2.5 లీటర్ల సీఆర్డీఈ ఇంజిన్‌ అమర్చారు. యాంటీ బ్రేక్ సిస్టమ్స్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ సీట్ బెల్ట్, రిమైండర్ ఆర్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ తదితర ఫీచర్లు చేర్చారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. 

మహీంద్రా థార్ తదుపరి తరం వచ్చే ఏడాది ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు. తదుపరి రెండో తరం థార్ జీప్‌లో 140 హెచ్పీ లేదా 120 హెచ్పీ డీజిల్ ఇంజిన్ చేర్చారు. త్వరలో మహీంద్రా తన ఉత్పత్తి ‘థార్’ పెట్రోల్ వేరియంట్‌లో విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది.