Asianet News TeluguAsianet News Telugu

లగ్జరీ విద్యుత్ వెహికల్స్ కోసం రిమాక్‌తో మహీంద్రా టైఅప్

లగ్జరీ విద్యుత్ వాహనాల తయారీ దిశగా వడివడిగా అడుగులేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇటలీకి చెందిన రిమాక్ ఆటోమొబిలి సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.

Mahindra's Pininfarina Ties Up With Croatia-Based Rimac
Author
Mumbai, First Published Oct 2, 2018, 7:55 AM IST

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒక్కటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. పర్యావరణ హితమైన వాహనాలు ప్రత్యేకించి లగ్జరీ వాహనాల తయారీపై కేంద్రీకరిస్తోంది. అందులో భాగంగా క్రొయేషియాకు చెందిన రిమాక్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ, డ్రైవ్ ట్రైన్, హార్డ్ వేర్ తయారీలో ‘రిమాక్’ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. 

మహీంద్రా అండ్ మహీంద్రాతో కుదిరిన ఒప్పందం మేరకు రిమాక్ సాంకేతిక సహకారాన్ని అందించనున్నది. ఈ ఒప్పందంతో ‘ఆటోమొబిలి పినిన్ఫారినా పీఎఫ్ఓ హైపర్ కార్’ టెక్నాలజీ మహీంద్రా అండ్ మహీంద్రాకు అందుబాటులోకి రానున్నది.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ రిమాక్ సంస్థను ముఖ్యమైన టెక్నాలజీ భాగస్వామిగా ఆహ్వానించేందుకు మేం సంతోషిస్తున్నాం. ఆటోమొబిలి పినిన్ఫారినా అందమైన అధునాతన టెక్నాలజీని మాకు అందుబాటులోకి తేనున్నది. దీన్ని వినియోగంలోకి తేవడం వల్ల కర్బన ఉద్గారాల ఊసే ఉండదు. పినిన్ఫారినా బ్రాండ్ టెక్నాలజీ మాకు సరైంది’ అని చెప్పారు. 

రిమాక్ ఆటొమొబిలి వ్యవస్థాపకుడు మేట్ రిమాక్ మాట్లాడుతూ  ఇన్నోవేషన్, ఫెర్ఫార్మెన్స్, ఇటాలియన్ డిజైన్ పినిఇన్ఫారినా ఆటోమొబిలి చరిత్ర, వారసత్వం ప్రస్తుతం తయారు చేస్తున్న న్యూ హైపర్ కారు ‘పీఎఫ్ఓ’కు రిమాక్ కంబైనింగ్ రిమాక్ వాల్యూబుల్ టెక్నాలజీ అదనపు విలువను తెచ్చి పెడుతుందన్నారు. రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం పెద్ద మైలురాయి కానున్నదన్నారు.

2020 నాటికి లగ్జరీ హైపర్ కారును మార్కెట్‌లోకి తేవాలని భావిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రాకు తోడుగా పినిఇన్ఫారినా ఆటోమొబిలి కౌంట్ డైన్ ప్రారంభించింది. రెండు సంస్థల మధ్య మేనేజ్మెంట్ టీంను బలోపేతం చేసేందుకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా చిరిస్టియన్ జగన్, పీఎఫ్ఓ సీనియర్ అడ్వైజర్‌గా పీటర్ టుట్జర్‌ను నియమించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios