Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రా ఎస్‌యూ‌వి కార్ సరికొత్త రికార్డు.. మైనస్ సున్నా కంటే తక్కువ డిగ్రీలో కూడా..

సోషల్ మీడియాలో సమాచారం వెల్లడిస్తు ఎక్స్‌యూ‌వి400  చాలా తక్కువ అంటే మైనస్ జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా ప్రయాణించి రికార్డు సృష్టించిందని కంపెనీ తెలిపింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ ఎస్‌యూ‌విని హిమాచల్ ప్రదేశ్‌లోని కీలాంగ్, లాహౌల్ స్పితి వంటి అత్యంత చల్లటి ప్రదేశాలలో డ్రైవ్ చేశారు.

Mahindra electric SUV made a record XUV400 run  well in temperatures below zero degrees
Author
First Published Jan 9, 2023, 1:12 PM IST

చాలా మంది నిపుణులు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ చాలా చల్లని వాతావరణంలో ఎఫెక్ట్ అవుతాయని ఇంకా ఎలక్ట్రిక్ వాహనం  బ్యాటరీ మైలేజ్ కూడా తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ దేశీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ మహీంద్రా  కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి  మైనస్ జీరో ఉష్ణోగ్రతలలో కొత్త రికార్డును సృష్టించింది.  మహీంద్రా ఎక్స్‌యూ‌వి400 ఎలక్ట్రిక్ వివరాలు చూద్దాం..

కంపెనీ పేర్కొంది
సోషల్ మీడియాలో సమాచారం వెల్లడిస్తు ఎక్స్‌యూ‌వి400 చాలా తక్కువ అంటే మైనస్ జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా ప్రయాణించి రికార్డు సృష్టించిందని కంపెనీ తెలిపింది. చలి పర్వత ప్రదేశాల్లో  ఎలక్ట్రిక్ వాహనాలు మనుగడ సాగించడం కష్టమని  కంపెనీ  పోస్ట్‌లో పేర్కొంది. కానీ మహీంద్రాతో మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకున్నాము. ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎక్స్‌యూ‌వి400   ఒక రోజులో మైనస్-సున్నా ఉష్ణోగ్రతలలో  గరిష్ట దూరానికి ప్రయాణించి రికార్డు సృష్టించింది.

కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ ఎస్‌యూ‌విని హిమాచల్ ప్రదేశ్‌లోని కీలాంగ్, లాహౌల్ స్పితి వంటి అత్యంత చల్లటి ప్రదేశాలలో డ్రైవ్ చేశారు. ఈ సమయంలో ఈ SUV ఎటువంటి సమస్యలు లేకుండా 24 గంటల్లో దాదాపు 751 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ఇంకా ఈ  SUV మంచు రోడ్లపై కూడా సాఫీగా నడిచింది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
ఈ ఎస్‌యూ‌వి టాప్-స్పెక్ ట్రిమ్ బ్రాండ్  అడ్రినో X సాఫ్ట్‌వేర్‌తో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి ఎన్నో ఫీచర్లను పొందుతుంది. భద్రత పరంగా, ఈ ఎలక్ట్రిక్ SUVకి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్‌లు, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు మరికొన్ని సేఫ్టీ టెక్నాలజి లభిస్తాయి. ఈ ఎస్‌యూ‌వి SUV లాంచ్ సమయంలో అన్నీ ట్రిమ్ల  ఫీచర్లపై మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది.

మోటారు అండ్ బ్యాటరీ 
ఈ XUV400 ఎలక్ట్రిక్ SUVలోని PSM ఎలక్ట్రిక్ మోటార్ 147 హార్స్‌పవర్, 310 న్యూటన్ మీటర్ల టార్క్‌ను జెనరేట్ చేస్తుంది. దీని టాప్  స్పీడ్ 150 kmph ఇంకా కేవలం 8.3 సెకన్లలో సున్నా నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ SUV బ్యాటరీ గురించి చెప్పాలంటే, ఇందులో ఇచ్చిన బ్యాటరీ సామర్థ్యం 39.4 kWh ఇంకా బ్యాటరీ ప్యాక్ IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ పొందింది. బ్యాటరీ కోసం చిల్లర్ ఇంకా హీటర్ కూడా ఉన్నాయి ఇంకా బ్యాటరీ భారతదేశంలో మాత్రమే తయారు చేయబడింది. ఈ బ్యాటరీతో ఫుల్ ఛార్జ్‌లో దాదాపు 456 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.  మైలేజ్ పెంచుకోవడానికి మహీంద్రా వన్ పెడల్ డ్రైవింగ్‌ను కూడా అందిస్తోంది, తద్వారా డ్రైవర్ యాక్సిలరేటర్‌ను ఆఫ్ వొదిలేసి వాహనం బ్రేకింగ్‌ను చేసినపుడు ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి అవుతుంది . ఈ కారణంగా బ్యాటరీ ఛార్జ్ చేయబడుతుంది ఇంకా  SUV మైలేజ్ పెంచుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios