న్యూఢిల్లీ : ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గత ఫిబ్రవరిలో విడుదల చేసిన ఎక్స్‌యూవీ 300లో ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. న్యూఢిల్లీలో దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.11.5 లక్షలు. 

 

డబ్ల్యూ 8 డీజిల్‌ ఏఎంటీ ట్రిమ్‌, డబ్ల్యూ8 (ఆప్షనల్‌) ట్రిమ్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారుకు అమర్చిన ఎలక్ట్రానిక్‌ వేరియబుల్‌ జియోమెట్రీ టర్బో చార్జర్‌తో కూడిన 1.5 లీటర్‌ టర్బో ఇంజన్‌ 116.6 పీఎస్‌ పవర్‌ విడుదల చేస్తుంది. 

 

ఎఎమ్‌టి టెక్నాలజీ డబ్ల్యూ 8 (డీజిల్)  ఎక్స్‌యూవీ 300 ధరను రూ. 11.5 లక్షలుగా, డబ్ల్యూ 8 (ఆప్షనల్) ట్రిమ్‌ను రూ.12.7 లక్షలుగా ఖరారు చేసింది. ఫిబ్రవరి నాటి ఎక్స్‌యూవీ 300 మోడల్ కారుతో ధరతో పోలిస్తే దీని ధర రూ.55 వేలు అధికం. ఎక్స్ యూవీ 300 డబ్ల్యూ 8 కారు ధర రూ.10.8 లక్షలు కాగా, డబ్ల్యూ8 (ఆప్షనల్) మాన్యువల్ ట్రిమ్ కారు ధర రూ.11.99 లక్షలు.

 

1.5-లీటర్ టర్బో ఇంజిన్‌, ఎలక్ట్రానిక్ వేరియబుల్ జామెట్రీ టర్బోచార్జర్‌,116.6 పీఎస్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఎక్స్‌యూవీ 300 కారుకి కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఇప్పుడు ఈ ఆటో వేరియెంట్‌ కూడా అంతే ఆదరణతో బ్రాండ్‌ విలువను మరింతగా పెంచుతుందని ఆశిస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగం చీఫ్‌ విజయ్‌రామ్‌ నక్రా అన్నారు.