Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల విపణిలోకి బొలేరో గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌: రూ.7.28 లక్షల నుంచి షురూ

ట్రక్కుల విభాగంలో దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) చరిత్ర నెలకొల్పుతోంది. ఇప్పటికే కాంపర్ గోల్డ్ విభాగంలో మూడు వేరియంట్లు కలిగి ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా కాంపర్ గోల్డ్ జడ్ ఎక్స్ ట్రక్కును విడుదల చేసింది. దీని ధర రూ.7.28 లక్షల నుంచి మొదలవుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గార్ల చెప్పారు.
 

M&M launches new Bolero Camper range
Author
Hyderabad, First Published Jun 19, 2019, 10:33 AM IST

హైదరాబాద్: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తన బొలేరో కాంపర్‌ శ్రేణిలో సరికొత్త పికప్‌ అప్ గ్రేడ్ వర్షన్ ట్రక్‌ ‘బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌’ను మార్కెట్లోకి విడుదల చేసింది. మంగళ వారం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి కొత్త పికప్‌ ట్రక్‌ను విడుదల చేసింది. తెలంగాణలోని జహీరాబాద్‌ ప్లాంట్‌లో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ను ఉత్పత్తి చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ గార్గ చెప్పారు. 

మహీంద్రా బొలెరో కాంపర్‌ శ్రేణిలో ఇప్పటికే మూడు వేరియంట్లు ఉన్నాయి. తాజాగా ప్రీమియం వేరియంట్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ను తీసుకువచ్చినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ గార్గ తెలిపారు.
 
1,000 కేజీల పేలోడ్‌ సామర్థ్యం గల కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ ధరలు రూ.7.28 - రూ.7.8 లక్షల మధ్యన ఉన్నాయని విక్రమ్‌ తెలిపారు. ఏసీ, ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌తో తీసుకువచ్చిన కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ లీటర్‌ డీజిల్‌కు 15.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు. 

2018-19లో 1.62 లక్షల బొలేరో పికప్‌ వాహనాలను విక్రయించినట్లు విక్రమ్‌ తెలిపారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే విక్రయాల్లో 9 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ గార్గ చెప్పారు. 

కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర విక్రయాల్లో 10-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. పికప్‌ వాహన విభాగంలో బొలేరో 86 శాతం వాటాతో మార్కెట్‌ లీడర్‌గా ఉందని విక్రమ్‌ తెలిపారు.

జహీరాబాద్ ప్లాంట్లో తయారైన ఈ ట్రక్కు వెయ్యి టన్నుల కలిగిన సరుకు అవలీలగా తీసుకుపోగలదు. మూడు రకాల్లో ఈ వాహనం లభించనున్నది. లీటర్ పెట్రోల్‌కు 15.1 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్న ఈ వాహనంపై మూడేండ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వ్యారెంటీ సదుపాయం కల్పించింది.

బజాజ్‌ అనుబంధ సంస్థగా మహారాష్ట్ర స్కూటర్స్‌
ఒకప్పటి ప్రియా స్కూటర్స్‌ తయారీదారైన మహారాష్ట్ర స్కూటర్స్‌ లిమిటెడ్‌ బజాజ్‌ హోల్డింగ్‌ అండ్‌ ఇన్వె స్ట్‌మెంట్‌ (బీహెచ్‌ఐఎల్‌) అనుబంధ సంస్థగా మారింది. ఎం ఎ్‌సఎల్‌లో తనకు గల మొత్తం 27 శాతం వాటాలను బీహెచ్‌ఐఎల్‌కు పశ్చిమ మహారాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్స్ బదిలీ చేయడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. ఎంఎ్‌సఎల్‌ ప్రస్తుతం ద్విచక్ర, త్రికక్ర వాహనాల్లో ఉపయోగించే ప్రెషర్‌ డై కాస్టింగ్‌ డైస్‌, జిగ్స్‌ అండ్‌ ఫిక్చర్స్‌ తయారుచేస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios