ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం భారీన పడిన తర్వాత దశాబ్దంలో శరవేగంగా తేలికపాటి వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న దేశాల్లో భారతదేశం ఒక్కటిగా ఉన్నది. 2018 తేలికపాటి వాహనాల విక్రయం జరిగిన టాప్ -5 దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్నది.

మాంద్యం వల్ల గ్లోబల్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ నుంచి చైనా బయటకు వెళుతుందన్న ఊహాగానాల మధ్య భారత్ అగ్రశ్రేణి మార్కెట్లలో ఒకటిగా నిలువడం గమనార్హం. భవిష్యత్‌లో తేలిక పాటి వాహనాల కొనుగోళ్లలో గ్రామీణ ప్రాంతాలు కీలకంగా వ్యవహరిస్తాయని విశ్లేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఏడాదిలో భారతదేశ మార్కెట్ 40 లక్షల యూనిట్లతో 8.6% పెరుగుతుందని ఆటోమోటివ్ విశ్లేషణాత్మక సంస్థ ‘ఐహెచ్ఎస్ మార్కిట్’ పేర్కొంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి మార్కెట్లుగా ఉన్న చైనా, జర్మనీ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది.

అమెరికా, చైనాల్లో విక్రయాలు ఫ్లాట్ సాగాయి. 2017లో భారత మార్కెట్ స్వల్పంగా 8.2 శాతం పెరిగింది. కార్లు, యుటిలిటీ వెహికల్స్, వ్యాన్లు, పికప్ ట్రక్కుల్లోనూ తేలికపాటి వాహనాలు క్రమంగా మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయి.

గతేడాది బీమా ఫీజు పెంపుతోపాటు సూక్ష్మ, ఆర్థిక పరిస్థితుల్లో సమస్యల కారణంగా ఆర్థిక వ్యయం మరింత పెరిగింది. దీని ఫలితంగా ఆటోమొబైల్ మార్కెట్ అనిశ్చితిని ఎదుర్కొన్నది. 

మరోవైపు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలన్నీ భారతదేశ మార్కెట్ పైనే కేంద్రీకరించాయి.2009 తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమలో వాహనాల విక్రయం తగ్గిపోవడం ఇదే మొదటి సారి. దీనికి రూపాయి పతనం, వడ్డీరేట్ల పెంపు, టారిఫ్ రేట్ల పెరుగుదల వంటి బహుళ సవాళ్లు ఆటోమొబైల్ పరిశ్రమలో అనిశ్చిత వాతావరణానికి దారి తీశాయి. 

2019లో భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కాలుష్య రహిత వ్వవస్థ దిశగా  బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతకుముందు అంచనాల ప్రకారం తేలికపాటి వాహనాల విభాగంలో భారత్ 2021 నాటికి టాప్-3లో నిలుస్తుంది. 50 లక్షలకు పైగా వాహనాల విక్రయంతో జపాన్‌ను దాటేస్తుందని అంచనా. 

రష్యా, బ్రెజిల్ దేశాలకంటే భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ వ్రుద్ధి రేటు మందగమనంగా సాగుతోంది. 2018లో సేల్స్ 12-14 శాతం ఉంటాయని అంచనా. రష్యా, బ్రెజిల్ దేశాల కంటే భారతదేశ మార్కెట్ తక్కువగా ఉంటుందని టయోటా కిర్లోస్కర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా పేర్కొన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునీకరణ దిశగా అడుగులేస్తున్నదని అన్నారు. 

జపాన్ కార్ల తయారీ సంస్థలు టయోటా మోటార్స్ ప్లస్ సుజుకి మోటార్స్, టయోటా ప్లస్ ఫోర్డ్ మోటార్ కలగలిసి మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ భాగస్వామ్యంతో యుటిలిటీ వాహనాల తయారీపై కేంద్రీకరించాయి.

భారతదేశంలోని యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని కార్లను డిజైన్ చేసి, ఉత్పత్తి చేస్తున్నాయి. 2030 నాటికి ఆటోమోటివ్ పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. 

పలు సంపన్న దేశాల్లో వ్రుద్ధిరేటు సంతృప్త స్థాయికి చేరుకోవడంతోపాటు రష్యా, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాలు అంతర్గతంగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కానీ సుస్థిర ప్రగతి సాధిస్తున్న దేశం భారత్ వంటి దేశాల మార్కెట్లోకి వచ్చే రెండేళ్లలో అడుగు పెట్టాలని కియా గ్రూప్ ‘పీఎస్ఏ’, షాంఘై ఆటోమోటివ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రయాణికుల విభాగంలో భారతదేశ మార్కెట్లో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ కీలక పాత్ర పోషించనున్నాయి.