Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ నో వయ్యబుల్: మెర్సిడెస్ బెంజ్

భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వాహనాల ఉత్పత్తి ఏమాత్రం లాభసాటి కాదని జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంచ్ తేల్చి చెప్పింది. 

Launching EVs in India not a viable business case right now: Mercedes
Author
Mumbai, First Published Sep 21, 2018, 7:50 AM IST

భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వాహనాల ఉత్పత్తి ఏమాత్రం లాభసాటి కాదని జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంచ్ తేల్చి చెప్పింది. స్పష్టమైన విధాన లోపం, రాయితీలు అందుబాటులో లేకపోవడం వల్ల భారతదేశంలో విద్యుత్ కార్ల విక్రయంతో లాభాలార్జన కష్ట సాధ్యమేనని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మిచెల్ జోప్ స్పష్టం చేశారు. 

లగ్జరీ ఆటో మేకర్ మెర్సిడెస్ బెంజ్ గురువారం ‘సీ-క్లాస్’ సెడాన్ అప్ డేటెడ్ వర్షన్ కారును మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. భారత్ మార్కెట్‌లో దాని ధర రూ.40 లక్షల నుంచి రూ.48.5 లక్షల వరకు పలుకుతుంది. మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మిచెల్ జోప్ మాట్లాడుతూ ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్లతో తయారు చేసిన వాహనాలతో పోలిస్తే భారీగా దిగుమతి సుంకం విధించే విద్యుత్ ఆధారిత కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ (సీబీయూస్) కార్లు పోటీకి సరిపడేవి కావని స్పష్టం చేశారు. 

‘మేం భారతదేశ మార్కెట్‌లో విద్యుత్ కార్లను ఆవిష్కరించాలని ఆలోచిస్తున్నాం. కానీ దానికి ప్రభుత్వం విద్యుత్ వాహనాల విధానం కావాల్సి ఉంది. దీర్ఘ కాల ద్రుక్పథంతో తయారు చేసిన ఫ్రేంవర్క్, పారామీటర్లతో కూడిన విధానం కావాలి’ అని మిచెల్ జోప్ఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేనందున భారత్ మార్కెట్‌లో విద్యుత్ కార్ల విక్రయం అంత లాభసాటి కాదని భావిస్తున్నట్లు తెలిపారు. 

2022 నాటికి పది బ్యాటరీ విద్యుత్ వాహనాలను అంతర్జాతీయంగా ఆవిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మిచెల్ జోప్ చెప్పారు. 2025 నాటికి భారతదేశంలో విద్యుత్ వాహనాల విక్రయం 15 నుంచి 20 శాతం ఉండొచ్చునన్నారు. బ్యాటరీలతో ఆపరేట్ చేసే విద్యుత్ వాహనాల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గిస్తే విద్యుత్ వాహనాలకు మార్కెట్ ఉంటుందని తెలిపారు. 

దీంతోపాటు దేశీయంగా విద్యుత్ చార్జింగ్ వసతుల కల్పనతో విద్యుత్ వాహనాల మార్కెట్ విస్తరిస్తుందని అంచనా వేస్తున్నట్లు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మిచెల్ జోప్ చెప్పారు.

ప్రస్తుతం విద్యుత్ ఆధారిత కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ (సీబీయూస్) కార్లపై 100 శాతం దిగుమతి సుంకం విధించడంతో 40 వేల డాలర్ల భారం పడుతోందన్నారు. అయితే తమ సంస్థ ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ల తయారీపైనా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ సీ 220 డీ ప్రైం మోడల్ కారు రూ.40 లక్షలు, సీ 220 డీ ప్రోగ్రెసివ్ ధర రూ.44.25 లక్షలు, సీ 300 డీ ఎఎంజీ మోడల్ కారు రూ.48.50 లక్షలు పలుకుతోంది. 

సీ-క్లాస్ మోడల్ కారు ఆవిష్కరించినప్పటి నుంచి ఇప్పటివరకు 30,500 యూనిట్లు విక్రయించిందని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మిచెల్ జోప్ చెప్పారు. దీంతో భారతదేశ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ లగ్జరీ సెడాన్‌గా మెర్సిడెస్ బెంజ్ ‘సీ-క్లాస్’ కారు నిలిచిందన్నారు.

గత ఆరు నెలల్లో ఏడు మోడల్ కార్లను విక్రయించామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మిచెల్ జోప్ తెలిపారు. వచ్చే ఏడాది మరింత దూకుడుగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాల్లో 12.4 శాతం పురోగతి (8061 కార్లు) సాధించిందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios