కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న కేఎస్ఎల్ క్లీన్ టెక్ సంస్థ వచ్చే మూడేళ్లలో ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్స్ ఉత్పత్తిపై రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఉత్పాదక సామర్థ్యం పెంపొందించడంతోపాటు వాటి సేల్స్ అండ్ మార్కెటింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకోనున్నట్లు తెలిపింది. గత 10 ఏళ్లుగా సౌర విద్యుత్ రంగంలో పని చేస్తున్నది.

 తాజాగా ఎలక్ట్రిక్ మొబిలిటీలో అడుగు పెట్టేందుకు గ్లోబల్ సంస్థల భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతోంది. లిథియం ఐయాన్ బ్యాటరీల ఉత్పత్తితోపాటు ఇతర విడి భాగాలను ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 

క్లీన్ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ ధీరజ్ బాగ్ చంద్కా మాట్లాడుతూ ఉత్పాదక సామర్థ్యం అభివ్రుద్ధి, మార్కెటింగ్, సేల్స్ కోసం మూడేళ్లలో రూ.200 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు రూపొందించాన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశీయంగా తయారు చేయాలన్న అత్యవసరమైన విడి భాగాల అభివ్రుద్ధిపైనా కేంద్రీకరిస్తామన్నారు. 

ప్రస్తుతం కేఎస్ఎల్ క్లీన్ టెక్ ఎలక్టికా బ్రాండ్ కింద నార్త్, సెంట్రల్ ఇండియా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ విక్రయిస్తోంది. కోల్ కతా నగర సమీపాన గల ఉత్పాదక, అసెంబ్లింగ్ యూనిట్‌లో ఏటా 10 వేల యూనిట్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దేశీయంగా ఎలక్ట్రిక్ మొబిలిటీకి గల ప్రోత్సాహక వాతావరణం నేపథ్యంలో సహజంగానే బిజినెస్‌ విస్తరణలో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చి చేరతాయన్నారు. ఈ దఫా తాము ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్స్ పైనా కేంద్రీకరించామని ధీరచ్ బాగ్ చంద్కా చెప్పారు. 

ఏటా భారత్ ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్స్ సేల్స్ 8 లక్షలకు చేరుకుంటున్నాయి. స్కూటర్ల విభాగంలోకి కూడా ప్రవేశిస్తామని ధీరజ్ బాగ్ చంద్కా తెలిపారు. డిఫరెంట్ ధరలకు కొన్ని మోడళ్ల స్కూటర్లను ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదితన ఫేమ్ -2 పథకంతోనూ తాము అనుసంధానమై పని చేస్తున్నామని తెలిపారు. 

యావత్ త్రీ వీలర్స్ వెహికల్స్‌ను ప్రస్తుత దశలో లిథియం ఐయాన్ బ్యాటరీలోకి మార్చడం కష్ట సాధ్యమేనని ధీరజ్ బాగ్ చంద్కా తెలిపారు. మార్కెట్ పరిస్తితులను బట్టి లెడ్ యాసిడ్ మోడల్ బ్యాటరీల తయారీపై ద్రుష్టి పెట్టినట్లు వివరించారు. బ్యాటరీల తయారీ విషయమై కొన్ని గ్లోబల్ సంస్థలతో చర్చలు అడ్వాన్స్ దశలో ఉన్నయని చెప్పారు.