Asianet News TeluguAsianet News Telugu

కియా సెల్టోస్ ఆవిష్కరణ.. ద్వితీయార్థంలో భారత విపణిలోకి


దక్షిణ కొరియా మేజర్ కియా మోటార్స్ కియా సెల్టోస్ కారును ఆవిష్కరించింది. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇది హ్యుండాయ్ క్రెటా, నిసాన్ కిక్స్, మహీంద్రా ఎక్స్ యూవీ 500, టాటా హరియర్, ఎంజీ హెక్టర్ మోడల్ కార్లతో తలపడనున్నది. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉండొచ్చునని అంచనా. 

Kia Seltos unveiled, expected to be priced between Rs 10 lakh and Rs 16 lakh
Author
New Delhi, First Published Jun 21, 2019, 3:18 PM IST

న్యూఢిల్లీ: పేరొందిన ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా మోటార్స్’ భారత విపణిలోకి ఈ ఏడాది ద్వితీయార్థంలో కంపాక్ట్ ఎస్‌యూవీ మోటర్ కారు ‘సెల్టోస్’ను ప్రవేశ పెట్టనున్నది. ఇది హ్యుండాయ్ క్రెటా, నిసాన్ కిక్స్, మహీంద్రా ఎక్స్ యూవీ 500, టాటా హారియర్, ఎంజీ హెక్టార్ కార్లతో తల పడనున్నది. 

దక్షిణ కొరియా కార్ మేకర్ కియా మోటార్స్ ‘సెల్టోస్’ కారును నాలుగు మోడళ్లలో లభించనున్నది. బీఎస్ -6 ప్రమాణాలకనుగుణంగా థర్డ్ జనరేషన్ స్మార్ట్ స్ట్రీమ్‌తో అభివ్రుద్ధి చేసిన కియా సెల్టోస్ కారును సంస్థ యాజమాన్యం గురువారం ప్రదర్శించింది.

ఈ కారు టెక్‌లైన్‌, జీటీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టెక్‌లైన్‌లో కేవలం కారు బాహ్యభాగం తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టారు. ఇక జీటీ లైన్‌లో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. 

1.4 టర్బో పెట్రోల్, ఇతర పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఐవీటీ, 7-స్పీడ్ డీసీటీ, 6 -స్పీడ్ ఏటీ, 6 -స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్  మల్టీపుల్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 

ఈ కంపాక్ట్ ఎస్‌యూవీ కారును నార్మల్, ఎకో, స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్స్‌లో నడుపొచ్చు. ఐకానిక్ టైగర్ నోస్ గ్రిల్లె, ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌తోపాటు టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

ఎల్ఈడీ టెయిల్ లైట్స్‌తోపాటు డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్స్‌తో స్పోర్టీ లుక్‌నిస్తుంది. 17 అంగుళాల ఫైవ్ స్పోక్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్ర రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటినా కూడా ఉన్నాయి. 

10.25 అంగుళాల టచ్ స్క్రిన్ ఆడియో వీడియో నేవీగేసన్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ కంపాటబిలిటీ, 8 -స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ హ్యాండిల్ చేసేందుకు క్వాలిటీ స్విచ్చెస్ తదితర ఫీచర్లు చేర్చారు.  

కియా సెల్టోస్ అడ్వాన్సుడ్ హై స్ట్రెంథ్ స్టీల్ స్ట్రక్చర్ తో రూపొందించింది. మల్టీపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఏబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్,  రివర్స్ పార్కింగ్ సెన్సర్లు అండ్ కెమెరా, విజువల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), టీసీఎస్ (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ తదితర ఫీచర్లు చేర్చారు. 

ఎస్పీ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న కియా సెల్టోస్ ధర భారతదేశంలో రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పలుకుతుందని అంచనా. ఈ కారును గతేడాది నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో తొలిసారి ప్రదర్శించారు.

ఈ కారులో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను కూడా అమర్చారు. దీనిని మొదటి రెండు సీట్ల  మధ్యలో అమర్చారు. 360 డిగ్రీలను కవర్‌ చేసే విధంగా కెమేరాను ఈ కారులో ఏర్పాటు చేశారు. ఈ సెగ్మెంట్‌లో తొలిసారి ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios