ఇండియాలో నేడే కియా కేరెన్స్‌ లాంచ్.. ధర నుండి అప్ డేట్ ఫీచర్స్ వరకు ప్రతిది తెలుసుకోండి..!

కియా ఫిబ్రవరి 15న అంటే నేడు కేరెన్స్‌ ఎం‌పి‌వి ధరలను ప్రకటించనుంది అలాగే రిజర్వేషన్ విండో తెరిచిన మొదటి 24 గంటల్లోనే 7,738 బుకింగ్‌లను పొందడంతో కారుకు భారీ డిమాండ్ ఏర్పడింది.
 

Kia Carens to launch in India today expected price range: Watch it live HERE

హ్యుందాయి తరువాత  దక్షిణ కొరియా రెండవ అతిపెద్ద  ఆటోమోబైల్ తయారీ సంస్థ  కియా ఇండియా(kia india) డిసెంబర్ 2021న భారతీయ అలాగే ప్రపంచ మార్కెట్‌ల కోసం కేరెన్స్‌(Carens)ను ఆవిష్కరించింది. భారతదేశంలో సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత నాల్గవ ఉత్పత్తిగా కియా కేరెన్స్‌ నిలిచింది. అయితే ఇప్పుడు కియా భారతదేశం కోసం కేరెన్స్‌ ధరను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది.

డిజైన్ పరంగా కేరెన్స్‌  ఒక ఎం‌పి‌వి, దీనికి ఒక చంకీ ఫ్రంట్ బంపర్, ఫ్లాట్ బోనెట్, ఇంటిగ్రేటెడ్ Y- ఆకారపు ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్ తో కూడిన డ్యూయల్-బీమ్ ఎల్‌ఈ‌డి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, రూఫ్ ట్రాక్స్,  బాడీ క్లాడింగ్, స్పోర్టీ డ్యూయల్-టోన్‌తో పాటు క్రోమ్ హైలైట్స్ వంటి ఎస్‌యూ‌వి-స్టయిల్ ఫీచర్లను పొందుతుంది.

కియా కేరెన్స్‌లో 8 స్పీకర్లతో  బోస్ (BOSE) సౌండ్ సిస్టమ్, వైరస్ అండ్ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ తో కూడిన స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్కైలైట్ సన్‌రూఫ్, ఓవర్ ది ఎయిర్ (OTA) సిస్టమ్ అప్‌డేట్స్, కూలింగ్ ఫంక్షన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జర్, కియా కేరెన్స్‌ లో బలమైన 10 హై-సేఫ్టీ ప్యాకేజీ ఉంది, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఈ‌ఎస్‌సి, ఏ‌బి‌ఎస్ ఇంకా  మరెన్నో ఉన్నాయి.

కియా కేరెన్స్‌  వేరియంట్‌లలో L, LX, EX, EX+, TX అండ్ TX+ ఉండగా వీటిలోని కొన్ని వేరియంట్‌లు  LX ప్రీమియం, EX ప్రెస్టీజ్, EX+ ప్రెస్టీజ్+, TX లగ్జరీ అండ్ టాప్ లైన్ TX+ లగ్జరీ+ వంటివి  సబ్ డివైడెడ్ చేయబడతాయి. 

కియా కేరెన్స్‌ లో  కియా సెల్టస్  వంటి ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది,  1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 140 PS పవర్ ఇంకా 242 Nm టార్క్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 115PS పవర్ అండ్ 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా డి‌సి‌టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుండగా డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో  లభిస్తుంది.

కియా కేరెన్స్‌  ధర రూ.14 లక్షల నుండి రూ.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా వేయగా హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారి, ఎం‌జి హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700తో పోటీ పడనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios