Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ కార్ల దిశగా భారత్ స్పీడ్!!

రోజురోజుకు పెరిగిపోతున్న భూతాప నివారణ దిశగా ముందుకెళ్లేందుకు భారత్ క్రమంగా సంసిద్ధమవుతోంది. ఇందుకోసం మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఈ క్రమంలో నిబంధనలు సరళతరం చేసినా.. చార్జింగ్ స్టేషన్లలో పార్కింగ్ స్థలాభావం సమస్యగా మారనున్నది.
 

India may finally race forward in electric cars
Author
New Delhi, First Published Dec 23, 2018, 12:02 PM IST

గత ఏడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు శరవేగంగా అభివ్రుద్ధి చెందుతున్నాయి. భూతాప నివారణకు పారిస్ లో జరిగిన ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. చైనా అత్యధికంగా కర్బన ఉద్గారాలు విడుదల చేస్తోంది.

తర్వాతీ స్థానంలో భారత్ నిలిచింది. రెండు దేశాలు బొగ్గు వినియోగంలో ఆరితేరాయి.  కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పారిస్ ఒప్పందం అమలు దిశగా ఆకాంక్షాపూరితమైన విధానాలు, లక్ష్యాలను నిర్దేశిస్తూ కేంద్రం ముందుకు సాగుతోంది. 

విద్యుద్దీకరణతో కూడిన కార్ల తయారీతోపాటు వినియోగం దిశగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. 2030 నాటికి భారతదేశమంతటా విద్యుత్ వినియోగ కార్లు మాత్రమే పరుగులు తీస్తూ ఉండాలని కేంద్ర మంత్రి ప్రకటించారు. కానీ నూతన లక్ష్యం ప్రకారం దేశీయ కార్లు, వాహనాల్లో 30 శాతం విద్యుద్దీకరించాల్సి ఉంది. 

దేశీయంగా శక్తిమంతమైన ఆటోమొబైల్ సంస్థలు కూడా విద్యుత్ ఆధారిత కార్ల తయారీ కోసం అంతే వేగంగా ముందుకెళుతున్నాయి. విద్యుత్ కార్ల వినియోగానికి దేశీయంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ముసాయిదాను ప్రకటించింది కూడా.

ఇప్పటివరకు మౌలిక వసతుల లేమికారణంగా కార్ల తయారీ సంస్థలు విద్యుత్ ఆధారిత వాహనాలపై ద్రుష్టి సారించడానికి వెనుకంజ వేస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనతోపాటు విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు సగటున సదరు విద్యుత్ ఉత్పత్తి ఖర్చుపై 15 శాతానికి మించరాదని కూడా షరతు విధించారు.

మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతులిచ్చేందుకు సిద్ధంగా సర్కార్ ఉంది. 2000వ దశకం ప్రారంభంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది.

తక్కువ ధరకు విక్రయించే ప్రొవైడర్ల వద్ద కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చారు పాలకులు. ఇంటి విద్యుత్ వినియోగదారులు కూడా కార్లు, ఇతర వాహనాలకు చార్జింగ్ వసతులు ఏర్పాటు చేయొచ్చు. 

ఈ క్రమంలో విద్యుత్ రంగంలో సంస్కరణల అమలు అనివార్యంగా కనిపిస్తున్నది. దీనివల్ల ప్రతి ఇంటిలోనూ విద్యుత్ చార్జింగ్ వసతి అందుబాటులో ఉంటుంది. టెక్నాలజీ విస్తరణతోపాటు వేగంగా ఏ మేరకు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నదన్న అంశం కూడా విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో కీలకం కానున్నది. 

సుదీర్ఘ కాలం క్రితం మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత టెలికమ్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. గతంలో ఫోన్ కాల్స్ కోసం భారీగా లైన్లలో నిలుచుండాల్సి వచ్చేది. అయితే విద్యుత్ చార్జింగ్ స్టేషన్లలో కీలకమైన సమస్య పార్కింగ్ స్థలం అవసరం.

విద్యుత్ కనెక్షన్ తేలిగ్గానే లభించినా.. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం సాంకేతిక అవసరాలపై ప్రణాళికల్లో సమస్యలు కనిపిస్తున్నాయి. కాకపోతే విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఒకింత వ్యయ భరితమే. 

దేశీయంగా విద్యుత్ కార్ల వినియోగంపై పాఠాలు- గుణపాఠాలు పొందాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం కూడా భవిష్యత్‌లో భూతాప నివారణ దిశగా ధ్రుడ నిశ్చయంతో ముందుకు సాగుతోంది.

భారతదేశం ఇప్పటికి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. మన పొరుగున అభివ్రుద్ధి చెందిన దేశం చైనా కేంద్రీక్రుత విధానంతో భూతాప నివారణ దిశగా ముందుకు సాగుతోంది. మనదేశం కూడా భూతాప నివారణ కోసం ప్రయత్నిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios