చార్జింగ్ పెడుతుండగా పేలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ (వీడియో)

Huge Blast As Electric Scooter Explodes
Highlights

ఇప్పటివరకు సెల్ ఫోన్లు పేలిన ఘటనలు అనేకం జరిగాయి. అది కూడా చైనా కంపనీకి చెందిన రెడ్ మీ నోట్ 4 పోన్లు తరచూ పేలుళ్లకు గురవుతూ  వినియోగదారులను భయానికి గురిచేశాయి. తాజాగా చైనాకే చెందిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పేలిపోయింది. చార్జింగ్ పెట్టిన సమయంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ శబ్దం చేస్తూ పేలిపోయిన సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనా రాజధాని బీజింగ్ చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్ లో చైనా కంపనీకే చెందిన ఈస్కూటర్ రెండు వారాల క్రితమే కొనుగోలుచేశాడు. ఇది ఎలాంటి ఇంధనం లేకుండా కేవలం ఎలక్ట్రిక్ చార్జింగ్ ద్వారా నడుస్తుంది. అయితే దీన్ని వినియోగదారుడు తన ఇంట్లో చార్జింగ్ పెట్టాడు. ఇలా చార్జింగ్ పెట్టిన కాస్సేపటికే ఈ స్కూటర్ నుండి పొగలు రావడం మొదలయ్యాయి. దీంతో దాని దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. అయితే ఇలా పొగలు కక్కుతున్న స్కూటర్ ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. దీంతో వినియోగదారుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు భయకంపితులయ్యారు.

భారీగా మంటలు చెలరేగడంతో బాధితుడు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ముందుగానే అప్రమత్తమవడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

ఈ ఘటన గురించి వినియోగదారుడు మాట్లాడుతూ...స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో కంపనీ వారు 12 గంటలు చార్జింగ్ పెట్టాలని చెప్పారని తెలిపాడు. దీంతో రోజూ అలాగే చార్జింగ్ పెట్టేవాడినని తెలిపాడు. కానీ ఇలా ప్రమాదం పొంచివుందని ఊహించలేదని బాధితుడు వాపోయాడు.

వీడియో

loader