Asianet News TeluguAsianet News Telugu

పవన్‌కు రాహుల్ బజాజ్ సపోర్ట్: జీఎస్టీ తగ్గించాల్సిందే


కర్బన ఉద్గారాల తగ్గింపు, బీఎస్ -6 ప్రమాణాల అమలు, టెక్నాలజీ వినియోగంతో బైక్ లు, స్కూటర్ల తయారీ వ్యయ భరితం అవుతున్నదని బజాజ్ ఆటో ఎండీ రాహుల్ బజాజ్ పేర్కొన్నారు. బీమా వ్యయం కూడా వినియోగదారుడు భరించాల్సి ఉంటుందని గుర్తు చేసిన రాహుల్ బజాజ్.. జీఎస్టీని హేతుబద్ధీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. 

Hero MotoCorp, Bajaj Auto back GST reduction on motorcycles but differ on timing
Author
New Delhi, First Published Jan 5, 2019, 10:25 AM IST

న్యూఢిల్లీ: మోటారు బైక్‌లు, స్కూటర్లపై విధిస్తున్న జీఎస్టీని 28 నుంచి 18 శాతం శ్లాబ్ పరిధిలోకి తేవాలన్న హీరోమోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ డిమాండ్‌కు బజాజ్ ఆటోమొబైల్ ఎండీ రాహుల్ బజాజ్ మద్దతు పలికారు. దీన్ని నూతన మోడల్ ఉత్పత్తులకు పరిమితం చేస్తే మంచిదని కూడా సూచించిన రాహుల్ బజాజ్.. జీఎస్టీ విధానాన్ని హేతుబద్ధీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. 

పర్యావరణ పరిరక్షణ వ్యయ భరితం
తాము మోటారు సైకిళ్లు, స్కూటర్లను ప్రజలకు విలాస వస్తువులుగా అందజేయడం లేదని హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్, బజాజ్ ఆటో ఎండీ రాహుల్ బజాజ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లతోపాటు పర్యావరణ పరిరక్షణకు కర్భన ఉద్గారాల నియంత్రణ చర్యలు చేపడుతుండటంతో బైక్‍లు, స్కూటర్ల తయారీ వ్యయ భరితంగా మారిందని రాహుల్ బజాజ్ తెలిపారు. 

ఖర్చు పెంచిన టెక్నాలజీ వినియోగం
దీనికి తోడు టెక్నాలజీ డిజైన్లు కూడా ఖర్చు పెరుగుదలకు కారణం అని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 10వ తేదీన జరుగనుండగా రాహుల్ బజాజ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇంకా సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా బీఎస్- 6 ప్రమాణాలతోనూ వాహనాలను నిర్మించాల్సి ఉంటుందన్నారు. 

ఉత్పత్తి భారం వినియోగదారుడి పైనే
దీని వల్ల వాటి ఉత్పత్తి భారం వినియోగదారుడిపై మోపకుంటా జీఎస్టీని తగ్గించాలని బజాజ్ ఆటోమొబైల్ ఎండీ రాహుల్ బజాజ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ జీఎస్టీ శ్లాబ్ తగ్గిస్తే లక్షల మంది టూ వీలర్ వినియోగదారులతోపాటు దేశ సంపద పెంపొందించడంలో ఆటోమొబైల్ పరిశ్రమ పాత్రను బలోపేతం చేసినట్లవుతుందన్నారు.  ఇప్పటికే వాహనాల బీమా వ్యయం ఒకేసారి చెల్లించాల్సి రావడంతో వినియోగదారుడికి మోయలేని భారం అవుతున్నదని రాహుల్ బజాజ్ గుర్తు చేశారు. 

మరింత ప్రియం కానున్న బడా కార్లు 
దేశీయంగా బడా కార్లు మరింత ప్రియం కానున్నాయి. రూ.10 లక్షల కంటే అధిక విలువ చేసే కార్లపై అదనపు పన్ను చెల్లించాల్సి రానుంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. ఇకపై పెద్ద కార్ల విలువపైన కాకుండా.. కారు ఇన్వాయిస్‌ విలువకు టీసీఎ్‌స (మూలం వద్ద పన్ను వసూలు)ను కలిపితే వచ్చే మొత్తంపైన జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఇకపై పెద్ద కార్ల కొనుగోలు సమయంలో చెల్లించే టీసీఎ్‌సపైనా కేంద్రం జీఎ్‌సటీ వసూలు చేయనుందన్నమాట. ప్రస్తుతం రూ.10 లక్షల కంటే అధిక విలువ చేసే కార్లపై 1 శాతం టీసీఎస్‌ వర్తిస్తుంది.

మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు తెర
స్టాక్‌ మార్కెట్‌లో రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. రిలీఫ్‌ ర్యాలీతో శుక్రవారం సెన్సెక్స్‌ 181.39 పాయింట్ల లాభంతో 35,695.10 వద్ద, నిఫ్టీ 55.10 పాయింట్ల లాభంతో 10,727.35 వద్ద ముగిశాయి. వాణిజ్య యుద్ధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు అమెరికా-చైనా వచ్చే వారం చర్చలకు సిద్ధమవుతున్నాయన్న వార్తలు మార్కెట్‌కు టానిక్‌లా పని చేశాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటు పుంజుకోవడమూ సెంటిమెంట్‌ను పెంచింది.టీవల తీవ్రంగా నష్టపోయి ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న టెలికాం, మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లను మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. సూచీలు లాభాల్లో ముగియడానికి ఇది కూడా కలిసొచ్చింది. వారం మొత్తం మీద చూస్తే మాత్రం సెన్సెక్స్‌ 381.62 పాయింట్లు, నిఫ్టీ 132.55 పాయింట్లు నష్టపోయాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios