Asianet News TeluguAsianet News Telugu

ఎఫ్ఐ టెక్నాలజీతో విపణిలోకి హీరో మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125‌

హీరో మోటో కార్ప్స్ సరికొత్తగా ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీ (ఎఫ్ఐ)తో విపణిలోకి స్కూటర్ల విభాగంలో మాస్ట్రో 125, 2019 ప్లీజర్ ప్లస్ మోడల్స్ ప్రవేశపెట్టింది.
 

Hero Maestro Edge 125 And 2019 Pleasure+ Launched!
Author
New Delhi, First Published May 14, 2019, 11:08 AM IST

[11:06 AM, 5/14/2019] Sai Kumar: న్యూఢిల్లీ: హీరో మోటార్‌ కార్ప్స్ తన స్కూటర్‌ సెగ్మెంట్‌లో సరికొత్త మోడల్‌ మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125ను భారత విపణిలోకి సోమవారం ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి మ్యాస్ట్రో ఎడ్జ్ 125 కాగా, రెండోది ప్లెజర్ ప్లస్ 110. మ్యాస్ట్రో ఎడ్జ్, ప్లెజర్ 110 స్కూటర్లకు సక్సెసర్లుగా వీటిని తీసుకొచ్చింది.

మ్యాస్ట్రో ఎడ్జ్ 125లో ఫ్యూయల్ ఇంజక్షన్ (ఎఫ్ఐ), ఐ3ఎస్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎఫ్ఐ వేరియంట్ స్కూటర్ ధర రూ.62,700 కాగా, ఐ3ఎస్ వేరియంట్ డ్రమ్ బ్రేక్ ధర రూ.58,500, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.60,000. 

దేశంలో ఎఫ్ఐ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చిన తొలి స్కూటర్ ఇదేనని హీరో మోటో కార్ప్స్ పేర్కొంది. సంస్థ ఉత్పత్తి చేసిన 125సీసీ స్కూటర్‌ సెగ్మెంట్‌లో మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125 రెండోది కావడం గమనార్హం. 

హీరో మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125 స్కూటర్‌ బుకింగ్స్‌ని మే 16 నుంచి చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. మ్యాస్ట్రో ఎడ్జ్‌‌ బ్లూ, బ్రౌన్‌, గ్రే, రెడ్‌ రంగుల్లో, ఎఫ్‌ఐ వేరియంట్‌ పాంతర్‌ బ్లాక్‌, ఫేడ్‌లెస్‌ వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

125 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 8.5 బీహెచ్‌పీ శక్తి, 10.2 ఎన్‌ఎం టార్క్‌ను మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125 విడుదల చేస్తుంది. 12 ఇంచుల ఫ్రంట్‌, 10 ఇంచుల రేర్‌ అలాయ్‌ వీల్స్‌, బ్లాక్‌ రేర్‌ వ్యూ మిర్రర్స్‌, ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫిల్లర్‌ క్యాప్‌, యూఎస్‌బీ ఛార్జర్‌ వంటి ఫీచర్లతో ఈ మోడల్‌ని రూపొందించారు. 

అధిక ఇంధన సామర్థ్యం కోసం ఇతర హీరో మోటార్ వాహనాల్లో ఉపయోగించే ఐ3ఎస్‌ స్టార్ట్‌-స్టాప్‌ వ్యవస్థను ఈ మోడల్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. రెండు స్కూటర్లలోనూ యూఎస్‌బీ చార్జర్, ఎల్‌ఈడీ బూట్ ల్యాంప్, రియర్ టెయిల్ ల్యాంప్, ఫ్రంట్ పాకెట్స్, డిజిటల్ ఎన్‌లాగ్ డ్యాష్ బోర్డు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇక హీరో ప్లెజర్ ప్లస్ 110 స్కూటర్ షీట్ మెటల్ వీల్ వేరియంట్ ధర రూ.47,300 కాగా, కాస్ట్ వీల్ వేరియంట్ ధర రూ.49,300గా నిర్ణయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios