Asianet News TeluguAsianet News Telugu

హోండాకు సవాల్:మార్కెట్‌లోకి హీరో డెస్టినీ స్కూటర్‌

హోండా మోటార్స్ స్కూటర్ మోడల్ ‘యాక్టివా’కు హీరో మోటో కార్ప్స్‌ నుంచి మార్కెట్లోకి డెస్టినీ ప్రవేశించింది. 

Hero launches 125cc scooter Destini at Rs 54,650
Author
New Delhi, First Published Oct 23, 2018, 1:46 PM IST

న్యూఢిల్లీ: కొన్నాళ్లు జాయింట్ వెంచర్ నిర్వహించిన హీరో మోటార్స్, హోండా మోటార్స్ తర్వాత విడిపోయాయి. హోండా యాక్టివా మోడల్ స్కూటర్ భారతీయ మార్కెట్లో రికార్డులు నెలకొల్పింది. దీంతో హీరో మోటోకార్ప్‌ కూడా యాక్టివాకు ప్రతిజోడీగా స్కూటర్ ‘డెస్టినీ 125 సీసీ’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన ఈ స్కూటర్.. యాక్టివాను ఢీ కొట్టనున్నది.

రెండు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్‌ ధరలు రూ.54,650, రూ.57,500లకు లభించనున్నాయి. ‘స్కూటర్‌ విపణిలో 125 సీసీ విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఏడాదిలో 75% దూసుకెళ్లింది. అందుకే మేమూ ఈ విభాగంలోకి ప్రవేశించాం’ అని హీరో మోటోకార్ప్‌ గ్లోబల్‌ ప్రొడక్ట్‌ ప్లానింగ్‌ హెడ్‌ మాలో లీ మాసన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో ఈ విభాగంలోనే మరో స్కూటర్‌ విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. 

వచ్చే 3-4 వారాల్లో దేశవ్యాప్తంగా డెస్టినీ 125 విక్రయాలు ప్రారంభం కానున్నాయని హీరో మోటో కార్ప్ కంపెనీ తెలిపింది. దసరా సీజన్‌లో అమ్మకాలు నామమాత్రంగానే ఉన్నాయని, దీపావళి నాటికి పరిస్థితి మెరుగవుతుందనే హీరో మోటో కార్ప్స్ అమ్మకాల విభాగం హెడ్‌ సంజయ్‌ వ్యక్తం చేశారు.

తొలుత ఈ ఏడాది ఆటో ఎక్స్ పోలో హీరో మోటో కార్స్స్ ఇంతకుముందు డ్యుయట్ 125 మోడల్ స్కూటర్‌ను రీ మోడల్ చేసి ‘హీరో డెస్టినీ 125’ గా ప్రవేశపెట్టింది. ఈ వర్షన్ స్కూటర్ కాస్మెటిక్‌గా, మెకానికల్‌గా అప్ గ్రేడ్ చేసి, ప్రత్యర్థి సంస్థల స్కూటర్లకు దీటుగా తీర్చిదిద్దింది హీరో మోటో కార్ప్స్. ఫ్రంట్ వైపు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, సంప్రదాయ హెడ్ ల్యాంప్ కలిగి ఉంది. బ్రౌన్, రెడ్, బ్లాక్ అండ్స్ వంటి మెటాలిక్ కలర్ ఆప్షన్స్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. 

ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐబీఎస్), ట్యూబ్ లెస్ టైర్లు, బూట్‌లైట్ తోపాటు ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్, అండర్ సీట్ మొబైల్ చార్జర్ (ఆప్షనల్) బ్లూ లైట్ కూడా అదనపు ఆకర్షణ కానున్నాయి. న్యూ 125 సీసీ ఇంధన సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 8.7 పీఎస్ ఆఫ్ పవర్ అండ్ 10.2 ఎన్ఎం ఆఫ్ టార్చీ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్, పేటెంట్ పొందిన ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్) హీరో స్కూటర్లలో మొదటిది. ఇంతకుముందు స్పెండర్, పాషన్ సిరీస్ మోడల్ మోటార్ బైక్‌ల్లో మాత్రమే ఐ3ఎస్ టెక్నాలజీని వినియోగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios