Asianet News TeluguAsianet News Telugu

డిఫెన్స్ స్టాఫ్ కోసం హార్లీ డేవిడ్సన్ బైక్స్.. వాటి ధరలిలా

అమెరికా మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హార్లీ డేవిడ్సన్’ భారత్‌లో బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన మోటారు సైకిళ్లలో కొన్ని మోడల్ బైక్స్ ధరలను నిర్ణయించింది

Harley-Davidson BS 6 line-up prices announced
Author
New Delhi, First Published Mar 24, 2020, 11:42 AM IST

న్యూఢిల్లీ: అమెరికా మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హార్లీ డేవిడ్సన్’ భారత్‌లో బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన మోటారు సైకిళ్లలో కొన్ని మోడల్ బైక్స్ ధరలను నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి భారతదేశంలో బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మాత్రమే విక్రయించాల్సిన సంగతి తెలిసిందే. 

భారతదేశంలో పునాది ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ ప్రీమియం మోటారు సైకిళ్ల కంపెనీగా హార్లీ డేవిడ్సన్ నిలిచింది. మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభించి ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్నది. హార్లీ డైవిడ్సన్ 2009 నుంచి ఇప్పటి వరకు 25 వేల మోటారు సైకిళ్లను విక్రయించింది. 

Also read:రిలయన్స్ ఎం-క్యాప్ 86వేల కోట్లు ఔట్.. ఏడాది కనిష్ఠానికి వెయ్యి స్టాక్స్

వాటిలో స్ట్రీట్ 750 మోడల్ బైక్ అత్యధికంగా అమ్ముడైన మోటారు సైకిల్. ఇది అత్యంత చౌక ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉన్న బైక్ కూడా ఇదే. స్ట్రీట్ గ్లైడ్, రోడ్ గ్లైడ్, రోడ్ కింగ్, సీవీఓ మోడల్ బైక్ ధరలను ఇంకా నిర్ణయించలేదు. 

హై ఎండ్ మోడల్ బైక్స్ అయిన స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్, రోడ్ గ్లైడ్ స్పెషల్, రోడ్ కింగ్, సీవీఓ లిమిటెడ్ మోడల్ బైకుల ధరలను ఇంకా నిర్ణయించలేదు. వచ్చే నెలలో వీటి ధరలు ఖరారు కానున్నాయి. సీఎస్డీ స్టోర్స్ వయా రిటైల్ బైక్స్ విక్రయంలో తొలి ప్రీమియం మోటారు సైకిల్ బ్రాండ్‌గా హార్లీ డైవిడ్సన్ నిలిచింది. ఎంట్రీ లెవెల్ బైక్స్ స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ మోటారు సైకిళ్లను రక్షణశాఖ, ఎక్స్ సర్వీస్ మెన్, వారి డిపెండెంట్ల కోసం విక్రయిస్తోంది.

2020 స్ట్రీట్ 750 ధర రూ.5.34 లక్షలు పలుకుతుండగా, 2020 స్ట్రీట్ రాడ్ ధర రూ.6,55,500గా నిర్ణయించింది హార్లీ డేవిడ్సన్. సీఎస్డీ ధర రూ.4,60,332 నుంచి రూ.5,65,606లకు అందుబాటులోకి తెస్తోంది.  

2020 ఫ్యాట్ బాయ్ బీఎస్-6, 2020 ఐరోన్ 883 బీఎస్-6 మోడల్ బైక్స్ ధరలు ఖరారయ్యాయి. ఈ ఏడాది బీఎస్-6 హార్లీ డేవిడ్సన్ బైక్స్ ధరలను ఒకసారి పరిశీలిద్దాం.. 

బైక్ మోడల్         -    ధర
స్ట్రీట్ 750         -    రూ.5.34 లక్షలు-రూ.5.66 లక్షలు
స్ట్రీట్ యానివర్సరీ    -    రూ.5.47,100
స్ట్రీట్ రాడ్         -    రూ. 5.66 లక్షలు-రూ.6,55,500
ఐరోన్ 883         -    రూ.6,67,500 - రూ.9,74,000
ఫార్టీ ఎయిట్     -     రూ. 9.89 లక్షలు- రూ.11.09 లక్షలు
ఫార్టీ ఎయిట్ స్పెషల్     -    రూ.11.24లక్షలు-రూ.11.46 లక్షలు
కస్టమ్ 1200    -     రూ.11.61 లక్షలు-రూ.11.25 లక్షలు
లో రైడర్        -    రూ. 11,40 లక్షలు- రూ.14.23 లక్షలు
ఫ్యాట్ బాయ్     -    రూ. 14.38 లక్షలు- రూ. 18,75 లక్షలు
ఫ్యాట్ బాయ్ స్పెషల్    -     రూ. 18.90 లక్షలు
 

Follow Us:
Download App:
  • android
  • ios