Asianet News TeluguAsianet News Telugu

రాయల్ ఎన్ ఫీల్డ్ 350కి హార్లీ డేవిడ్సన్ 338 సవాల్


338 సీసీ సామర్థ్యంతో కూడిన మోటారు బైక్ ను విపణిలో ఆవిష్కరించడం ద్వారా రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ మోటారు బైక్ ఢీకొట్టేందుకు హార్లీ డేవిడ్సన్ సిద్ధమైంది. చైనాలోని క్వియాంగ్ జియాంగ్ మోటార్ బైక్ సంస్థ భాగస్వామ్యంతో ఆసియా మార్కెట్లోకి విస్తరించేందుకు హార్లీ డేవిడ్సన్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Harley-Davidson 338cc Motorcycle Announced, To Compete with Royal Enfield 350
Author
USA, First Published Jun 24, 2019, 12:07 PM IST

అమెరికా ఆటో దిగ్గజం ‘హార్లీ డేవిడ్సన్’ మరో మోటార్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ సామర్థ్యం గల బైక్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. అగ్రదేశాల్లో ఒక్కటైన చైనాలోని క్వియాన్ జియాంగ్ మోటార్ సైకిల్ కంపెనీతో కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చైనాలో హార్లీ డేవిడ్సన్ మోటారు సైకిళ్లు తేలిగ్గా లభ్యం కానున్నాయి. చైనా కంపెనీతో భాగస్వామ్యం ద్వారా హార్లీ డేవిడ్సన్ సంస్థ 338 సీసీ సామర్థ్యం గల బైక్‌ను ఆసియా ఖండ దేశాల మార్కెట్లలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నది. 

అమెరికా మార్కెట్లో విడుదల చేసే బైక్‌లతో పోలిస్తే ఆసియా మార్కెట్లలో విడుదల చేసే మోటారు సైకిళ్లలో 338 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ వినియోగించనున్నది. చైనాలోని ఝీజియాంగ్ ప్రావిన్స్ వెంగ్లింగ్ నగరంలోని క్వియాన్ జియాంగ్ కంపెనీలో హార్లీ డేవిడ్సన్ 338 సీసీ మోటారు బైక్ ఆవిష్క్రుతం కానున్నదని చైనా అదికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. హర్లీ డేవిడ్సన్ సంస్థ తాజాగా విడుదల చేయనున్న బైక్‌లో వినియోగించే 338 సీసీ సామర్థ్యం గల ఇంజిన్‌ను చైనాలోనే ఉత్పత్తి చేయనున్నది. 

చైనా ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యల వల్ల హార్లీ డేవిడ్సన్ తన వ్యూహం మార్చుకున్నది. టారిఫ్‌ల భారం తగ్గించుకునేందుకు బైక్‌ల ఉత్పత్తిని యూరప్ దేశాలకు మళ్లిస్తామని హార్లీ డేవిడ్సన్ ప్రకటించింది. 

అయితే చైనా మోటారు బైక్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్న హార్లీ డేవిడ్సన్ సీఈఓ మట్ట్ లెవాటిచ్ మాట్లాడుతూ తమ బ్రాండ్‌కు నూతన మార్గాలను స్రుష్టించిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మార్కెట్ చైనాలో బైక్ ల ఉత్పత్తికి అవకాశం లభించినందుకు తమకు ఆనందంగా, ఆసక్తిగా ఉన్నదని చెప్పారు. 

హార్లీ డేవిడ్సన్ సిగ్నేచర్ క్రూయిజర్ డిజైన్‌లో పలు ఫీచర్లను 338 సీసీ బైక్‌లో చేర్చనున్నది. అలాగే త్వరలో ఆసియా మార్కెట్లలో లైట్ వెయిట్ వెహికల్స్, అంతర్జాతీయంగా విద్యుత్ బైక్‌లను విడుదల చేస్తామని గతేడాదే ప్రకటించింది హార్లీ డేవిడ్సన్.తమ బ్రాండ్‌ను పలు రకాల కస్టమర్లు, ప్రాంతాలకు చేర్చేందుకు పలు మార్గాలు లభించాయని సంస్థ సీఈఓ మట్ట్ లెవాటిచ్ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios