Asianet News TeluguAsianet News Telugu

5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!: ఇజ్రాయెల్ కంపెనీతో ఓలా ఎలక్ట్రిక్ చేతులు, 160 కి.మీ నాన్ స్టాప్ ..

అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో పాటు ఇతర బ్యాటరీ టెక్నాలజీలు ఇంకా కొత్త ఎనర్జీ సిస్టమ్స్‌లో  R&Dని పెంచుకోవాలనే ఓలా ఎలక్ట్రిక్ దృష్టిలో ఈ పెట్టుబడి ఒక భాగం. ఈ‌వి తయారీదారులు ఓలా S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తయారు చేసే ఫ్యూచర్‌ఫ్యాక్టరీ డిమాండ్‌ను తీర్చడానికి దేశంలో బ్యాటరీ సెల్‌లను తయారు చేయడానికి గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 
 

Full charge in 5 minutes!: Ola Electric joins hands with this Israeli company, will get fast charging cell technology
Author
Hyderabad, First Published Mar 22, 2022, 11:54 AM IST

ఇండియన్ మల్టీనేషనల్ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (ola electric) సోమవారం ఇజ్రాయెలీ బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ స్టోర్‌డాట్‌తో  వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. స్టోర్‌డాట్ అనేది ఎక్స్‌ట్రీమ్ ఫాస్ట్ ఛార్జింగ్ (XFC) టెక్నాలజీతో బ్యాటరీలను కనిపెట్టే సంస్థ. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఓలా అత్యాధునిక XFC బ్యాటరీ టెక్నాలజి ఉపయోగించి కేవలం ఐదు నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయగలదు. 

ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఓలా భారతీయ మార్కెట్ కోసం స్టోర్‌డాట్  ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీని అనుసంధానించే బ్యాటరీలను తయారు చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ ట్విట్టర్ పోస్ట్‌లో  "మేము ఫ్యూచర్ సెల్ టెక్నాలజీలో భారీ పెట్టుబడి పెడుతున్నాము. ఇందుకు ఇజ్రాయెల్  స్టోర్‌డాట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. కేవలం నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు ఛార్జింగ్ చేయగల మా అగ్రగామి Xtreme ఫాస్ట్ ఛార్జింగ్ సెల్ టెక్నాలజీని పై కలిసి పని చేస్తున్నాము." అని అన్నారు.

అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో పాటు ఇతర బ్యాటరీ టెక్నాలజీలు ఇంకా కొత్త ఎనర్జీ సిస్టమ్స్‌లో  R&Dని పెంచుకోవాలనే ఓలా ఎలక్ట్రిక్ దృష్టిలో ఈ పెట్టుబడి ఒక భాగం. ఈ‌వి తయారీదారులు ఓలా S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తయారు చేసే ఫ్యూచర్‌ఫ్యాక్టరీ డిమాండ్‌ను తీర్చడానికి దేశంలో బ్యాటరీ సెల్‌లను తయారు చేయడానికి గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 

ప్రభుత్వ పిఎల్‌ఐ పథకం కింద అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్ కోసం ఓలా బిడ్‌లను సమర్పించింది అలాగే బ్యాటరీకి పిఎల్‌ఐ మినహాయింపుకు కంపెనీ అర్హత కలిగి ఉందని ఇటీవలి నివేదిక పేర్కొంది. రూ. 18,100 కోట్ల బడ్జెట్ వ్యయంతో దేశంలో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి 50 గిగా వాట్ అవర్ (GWh) తయారీ సామర్థ్యాన్ని సాధించడానికి ACC బ్యాటరీల కోసం PLI పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. 

కేవలం ఐదు నిమిషాల్లో ఈ‌వి బ్యాటరీని ఛార్జ్ చేయగల XFC టెక్నాలజీని తీసుకొచ్చిన కంపెనీ స్టోర్‌డాట్. కంపెనీ కొన్ని సంవత్సరాలలో  భారీ ఉత్పత్తిని ప్లాన్ చేస్తోంది. కంపెనీ రెండు నిమిషాల ఛార్జ్ టెక్నాలజీపై కూడా పని చేస్తోంది, దీనిని రాబోయే 10 సంవత్సరాలలో వాణిజ్యీకరించబడుతుంది. "ఎక్స్‌ట్రీమ్  ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న స్టోర్‌డాట్‌తో మా భాగస్వామ్యం వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది అలాగే  వాటిలో మొదటిది" అని అగర్వాల్ అన్నారు. ఈ‌విల భవిష్యత్తు మెరుగైన, వేగవంతమైన ఇంకా అధిక శక్తి సాంద్రత కలిగిన బ్యాటరీలపై ఆధారపడి ఉంటుందని, ఇవి వేగంగా ఛార్జ్ చేయగలవని ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios